Rajasthan: రాజస్థాన్ బిల్వారా జిల్లాలోని జహాజ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం చిన్న రోడ్డు ప్రమాదం, 25 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపడానికి కారణమైంది. టోంక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, జహాజ్‌పూర్ ప్రాంతంలోని ఒక మసీదు వద్ద తోపుడు బండిని కారు ఢీ కొట్టింది. స
Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ,
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
Kolkata gangrape: దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత మోనోజిత్ మిశ్రాతో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ క్యాంపస్‌లోని గార్డు రూంలో బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన చర్యలను నిందితులు మొబైల్స్‌లో వీడియో తీశారు. ఈ ఘటనపై టీఎంసీ పార్టీపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
Pakistan-Russia: భారత మిత్రదేశం రష్యా, శత్రుదేశం పాకిస్తాన్ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ని మధ్య ఆసియా దేశాల మీదుగా, రష్యాతో అనుసంధానించేలా భారీ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించేందుకు రెండు దేశాలు సహకరించుకోవడానికి అంగీకరించినట్లు శుక్రవారం పాక్ మీడియా తెలిపింది. సెంట్రల్ ఆసియాలోని కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్ వంటి దేశాలను ఈ మార్గం ద్వారా అనుసంధానించనున్నారు. భూపరివేష్టిత దేశాలుగా ఉన్న మధ్య ఆసియా దేశాలకు ఓడరేవులను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇటీవల, […]
Rahul Gandhi: బీహార్‌లో మహిళలకు పంపిణీ చేయాలనుకుంటున్న ఉచిత ‘‘శానిటరీ ప్యాడ్స్’’పై రాహుల్ గాంధీ బొమ్మ ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. మహిళల కోసం ఇచ్చే ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ముఖం ఎందుకు ఉందని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మహిళలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ ‘‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’’ కింద ఈ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నారు.
Nipah Virus: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం చెలరేగింది. ఇద్దరికి నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో మూడు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ఆరోగ్య అధికారులు కోరారు. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Marathi Row: రాజ్‌ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీ కార్యకర్తలు ‘‘మరాఠీ’’ మాట్లాడటం లేదని చెబుతూ ఓ దుకాణదారుడిపై దాడి చేయడంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించాడనే కారణంగా దాడి చేసినట్లు ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
B-2 Spirit bomber: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య 12 రోజలు ఘర్షణలో, ఇరాన్‌పై అమెరికా దాడితో ఈ సంఘర్షన కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌లోకి కీలకమైన అణు సౌకర్యాలపై అమెరికా, ప్రపంచంలోనే అతి శక్తివంతమమైన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలతో దాడి చేసింది. బంకర్ బస్టర్ బాంబుల్ని ఉపయోగించి, భూమి లోతులో అత్యంత సురక్షితంగా ఉన్న ఇరాన్ అణు ఫెసిటీలను ధ్వంసం చేసింది.