Air India Crash: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఈ విమానం, టేకాఫ్ అయన 30 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులే కాకుండా నేలపై ఉన్న పలువురు మరణించారు. అయితే, దర్యాప్తులో ఇంజన్ ఇంధన నియంత్రణ స్విచ్‌లపై పరిశోధకులు దృష్టి సారించిందని ప్రముఖ ఏవియేషన్ జర్నల్ ది ఎయిర్ కరెంట్లోని ఒక నివేదిక పేర్కొంది.…
Bangladesh: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని షేక్ హసీనా దిగిపోవాలని ఉద్యమించారు. అయితే, ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. చివరకు ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్‌కు అభ్యంతరం లేదని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే, బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు, ఉగ్రవాది తల్హ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌కు అవమానం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు.
CJI BR Gavai: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తన తండ్రి కలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం, ఆయన తన మాతృభాష మరాఠీలో చదువుకోవడం వల్ల కలిగిన ప్రయోజనాల గురించి వెల్లడించారు. తనకు మెరుగైన భావనాత్మక అవగాహన కలిగేందుకు మరాఠీ సహకరించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో జరిగిన న్యాయవాదుల కార్యక్రమంలో సీజేఐ తన చిన్ననాటి విషయాలను నెమరువేసుకున్నారు. ‘‘నేను న్యాయమూర్తిగా మారాలని నా తండ్రి కల నెరవేరినందుకు నేను సంతోషంగా ఉన్నాను’’అని భావోద్వేగంతో, కన్నీళ్లను అపుకుంటూ వెల్లడించారు.
F-35B Fighter Jet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత అడ్వాన్సుడ్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్, సాంకేతికత కారణాలతో కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో దిగింది. అయితే, అప్పటి నుంచి దీని సాంకేతిక సమస్యలు దూరం కాలేదు. దీంతో గత మూడు వారాలుగా ఎయిర్‌పోర్టులోనే ఉంది. చివరకు 24 మంది నిపుణులు దీనిని రిపేర్ చేయడానికి భారత్ రావాల్సి వచ్చింది. మరమ్మతుల కోసం ఎయిర్‌పోర్టులోని హ్యాంగర్‌కి తరలించారు.
Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.
Uddhav Sena: బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు.
Nagpur: నాగ్‌పూర్‌లో అత్యంత దారుణమైన గ్యాంగ్ ‘‘ఇప్పా గ్యాంగ్’’. ఈ గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు ఓ గ్యాంగ్ మెంబర్. ఇంకేముంది, తన లీడర్నే మోసం చేసిన వ్యక్తిని చంపేందుకు ఏకంగా 40 మంది కరడుగట్టిన హంతకముంఠా అతడి కోసం వెతుకుతోంది. సదరు మహిళ, తాను ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో బయటకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ముఠా ఆగ్రహాన్ని మరింత పెంచింది.
Serial killer: 24 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ‘‘సీరియల్ కిల్లర్’’ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కిల్లర్ అజయ్ లాంబాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే లాంబా, ఢిల్లీ, ఉత్తరాకండ్ అంతటా అనేక మర్డర్లకు పాల్పడే ముఠాను నడించాడనే ఆరోపణలు ఉన్నాయి.
F-35 Fighter Jet: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మూడు వారాలుగా నిలిచి ఉన్న బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ఎట్టకేలకు కదిలింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి 24 మంది నిపుణులు ఈ ఫైటర్ జెట్‌ని రిపేర్ చేశారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత ఈ విమానాన్ని రిపేర్ల కోసం హ్యాంగర్‌కు తరలించారు.