Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్‌తో తాను చాలా అసంతృప్తితో ఉన్నారనని, ఆయన ప్రజలను చంపాలనుకుంటూనే ఉన్నారని ట్రంప్ అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, పుతిన్ ఫోన్ కాల్ పట్ల నేను చాలా అసంతృప్తితో ఉన్నానని, ఆయన ప్రజల్ని చంపుతూనే వెళ్లాలని అనుకుంటున్నారని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో అన్నారు.
Read Also: Nitesh Rane: ‘‘జిహాదీ, హిందూ వ్యతిరేక ర్యాలీ’’.. ఠాక్రేలు పీఎఫ్ఐ, సిమి కన్నా తక్కువ కాదు..
యుద్ధాన్ని ముగించమని పుతిన్‌ను ఒప్పంచడానికి గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నానని, అయితే, రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇదే విధంగా శుక్రవారం, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీతో వ్యూహాత్మక సంభాషణ కొనసాగించినట్లు చెప్పారు. రష్యా ఇటీవల జరిపిన అతిపెద్ద డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత ఉక్రెయిన్ వైమానిక రక్షణ బలోపేతానికి ట్రంప్ అంగీకరించారని జెలెన్స్కీ గతంలో చెప్పారు. శుక్రవారం జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో ప్రత్యేక కాల్‌లో ఉక్రెయిన్‌కు పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను పంపడం గురించి చర్చించానని ట్రంప్ చెప్పారు. అయితే, జర్మనీ దీనికి ఇంకా అంగీకరించలేదు. మెర్జ్ తమను తాము రక్షించుకోవాలని భావిస్తున్నారని ట్రంప్ అన్నారు.