Karnataka: గుండెపోటు మరణాలు, ఆస్పత్రులకు పోటెత్తిన జనాలు..
- కర్ణాటకను భయపెడుతున్న గుండెపోటు మరణాలు..
- మైసూర్, బెంగళూర్ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు ‘‘గుండెపోటు’’ భయం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆకస్మిక గుండెపోటు కారణాలతో మరణించారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో, గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మైసూరులోని ప్రముఖ ఆస్పత్రి అయిన జయదేవా ఆసుపత్రికి గుండెపోటు పరీక్షల కోసం వేలాది మంది తరలివస్తున్నారు.
Read Also: Uttam Kumar Reddy: జగన్, కేసీఆర్ భేటీలోనే ఈ నిర్ణయం.. కృష్ణా నదీ జలాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ముఖ్యంగా, హసన్ జిల్లాలో ఇటీవల పలువురు యువకులు ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ వార్తలు మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రజలు బయపడుతున్నారు. దీంతోనే ఆస్పత్రులకు పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. అయితే, జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార అలవాట్లతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
గత నెలలో 40 రోజుల వ్యవధిలో హసన్‌లో 23 గుండెపోటు సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతోనే మైసూర్, బెంగళూర్ జయదేవా ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరిగింది. ఈ మరణాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మరణాలను పరిశోధించేందుకు జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కెఎస్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీని రాష్ట్రం ఆదేశించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..