Hyderabad: పండగ పూట హైదరాబాద్ నాచారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించే క్రమంలో జరిగిన చిన్న గొడవ అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారి తీసింది. మద్యం గ్లాస్ విషయంలో మొదలైన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో తమ్ముడు అన్నపై దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నను మూడో అంతస్తుపై నుంచి తోసేయడంతో అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మర్గమధ్యంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు స్టీఫెర్డ్ రోహన్ సాయర్స్ (30), నిందితుడు లేనర్డ్ లయనెల్ సాయర్స్ (28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన తమ్ముడు సాయర్స్‌ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
READ MORE: 2027 Sankranthi : మళ్లీ బరిలోకి చిరు vs ప్రభాస్..మధ్యలో బాలయ్య?