Chhangur Baba: జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
Shocking: హర్యానా హిసార్‌లో సంచలన ఘటన జరిగింది. ఒక గ్రామంలో ఇద్దరు మైనర్లు తమ హెయిర్ కట్ చేసుకోలేదని, క్షమశిక్షణ పాటించడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ తిట్టినందుకు ఏకంగా ఆయనను పొడిచి చంపారు. ప్రిన్సిపాల్‌పై కోపంతో ఇద్దరు విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు హన్సి ఎస్పీ అమిత్ యశ్వర్థన్ తెలిపారు.
Tragedy incident: ఉత్తర్ ప్రదేశ్‌లో అప్పుల బాధతో బాధపడుతున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫేస్బుక్ పోస్ట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. లైవ్‌లోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డయాబెటిక్‌తో బాధపడుతున్న తన కుమార్తెకు కనీసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనలేని అసమర్థ స్థితి ఉన్నానని లైవ్‌లోనే విలపించారు. తన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకుని మరణించాడు.
Canada: కెనడాలోని మానిటోబాలో విమానాలు ఢీకొన్న ప్రమాదంలో 23 ఏళ్ల భారతీయ పైలట్ స్టూడెంట్ మరణించినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు. ఒక ఫ్లైయింగ్ స్కూల్ వద్ద రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని కేరళకు చెందిన శ్రీహరి సుకేష్గా గుర్తించారు. మృతుడు కొచ్చిలోని త్రిప్పునితురలోని స్టాట్యూ న్యూరోడ్ వాసి. Read Also: Chhangur Baba: హిందూ, సిక్కు మహిళల్ని ఇస్లాంలోకి మారిస్తే ఒక్కో రేటు.. ఛంగూర్ […]
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా మాధ్పూర్కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబాగా పిలిచే వ్యక్తి అసలు నిజ స్వరూపం వెలుగులోకి వస్తోంది. మతమార్పిడే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ని కలిగి ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఏకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ‘లవ్ జిహాద్’ కోసం ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గ్రామంలోని ఛంగూర్ బాబాకు చెందిన విలాసవంతమైన భవనంలో సోదాలు చేయగా, విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Pema Khandu: టిబెటన్ బౌద్ధ మతగురువు దలైలామా తరుపరి వారసుడి గురించి చర్చ నడుస్తోంది. ఈ అంశం భారత్, చైనా మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా చైనా సార్వభౌమత్వం , చట్టాలకు అనుగుణంగా ఉంటాడని చైనా చెప్పింది. అయితే, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. తదుపరి దలైలామా వారసుడిని, దలైలామా మాత్రమే నిర్ణయించే హక్కు ఉందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై, ఈ విషయంలో భారత్ దూరంగా ఉండాలని చైనా కోరింది.
Nimisha Priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం నిమిషా ప్రియా కేసు భారత సుప్రీంకోర్టుకు చేరింది. ఉరిశిక్షకు రెండు రోజుల ముందు అంటే, జూలై 14న అత్యవసరంగా పిటిషన్‌ను విచారించనుంది.
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్, భారతదేశానికి ఒక ‘‘వాటర్ బాంబ్’’ అని అరుణాచల్ సీఎం పెమా ఖండూ అన్నారు. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా, మరేదైనా పెద్ద సమస్యగా ఉంటుందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు. ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రదానం చేసింది.
Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఆమోదం పొందింది.