Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్‌ని బకరా చేసిందని ఇప్పుడు అమెరికా వైమానిక దళ మాజీ F-15E, F-16 పైలట్ అయిన ర్యాన్ బోడెన్‌హైమర్ చెప్పారు. భారత్ నిర్వహించిన వైమానిక పోరాటం ఆధునిక ఎయిర్ కాంబాట్‌లో ఒక పురోగతిగా అభివర్ణించారు.
ముఖ్యంగా, భారత్ ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)’’ ఆధారిత సాంకేతికతను ఉపయోగించినట్లు బోడెన్ హైమర్ చెప్పారు. రాఫెల్ X-గార్డ్ డెకాయ్ వ్యవస్థతో పాకిస్తాన్ వైమానికి ముప్పును తప్పించినట్లు పేర్కొన్నారు. X-గార్డ్ వ్యవస్థను రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఇది 500-వాట్, 360-డిగ్రీల జామింగ్ సిగ్నల్‌ను ఉత్పత్తి చేయడానికి ఏఐ ఉపయోగిస్తుంది. ఈ పరికరం 30 కిలోలు ఉంటుంది. వంద మీటర్ల ఫైబర్ అప్టిక్ కేబుల్ సాయంతో విమానం వెనక ఉంటుంది. ఇది రాఫెట్ జెల్ రాడార్ సిగ్నల్స్, డాప్లర్ ఎఫెక్ట్‌ని కాపీ చేస్తుంది. దీంతో శత్రు దేశాల రాడార్ వ్యవస్థలు, క్షిపణులు నిజమైన విమానాన్ని గుర్తించడంతో విఫలమవుతాయి.
Read Also: Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఈ ఒక్క పనిచేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరినట్టే!
ర్యాన్ బోడెన్ హైమర్ ప్రకారం, మనం ఇప్పటి వరకు చూసిన అత్యుత్తమ స్పూఫింగ్, మోసం అని, ఈ ఎలక్ట్రానిక్ యుద్ధ నియమాలను పునర్నిర్వచించిందని ఆయన భారత్‌ని ప్రశంసించారు. ఈ డెకోయ్ శత్రువుల రాడార్లను గందరగోళపరిచింది. పాకిస్తాన్ నిజమైన జెట్ ఏదో తెలుసుకోలేకపోయింది. చైనా నుంచి పాక్ దిగుమతి చేసుకున్న PL-15E క్షిపణికి స్పూఫింగ్‌ను ఎదుర్కొనే టెక్నాలజీ లేదు. దీంతో X-గార్డ్ పాకిస్తాన్ J-10C ఫైటర్ జెట్లలో ఉన్న KLJ-7A AESA రాడార్‌ను గందరగోళానికి గురిచేసింది. దీంతో పాకిస్తాన్ తాము రాఫెల్ జెట్లను కూల్చామని భ్రమపడి ఉండొచ్చని అమెరికన్ నిపుణుడు చెప్పాడు.
X-గార్డ్ పాత యూఎస్ వ్యవస్థల కన్నా వేగంగా పనిచేస్తుంది. దీని మూలంగానే పాకిస్తాన్ తాము రాఫెల్ జెట్లను కూల్చామని చెప్పి ఉండొచ్చు. ఈ వ్యవస్థ విమానం వెనక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. దీని వల్ల శత్రువులు దీనినే విమానంగా పొరబడి కాల్పులు జరుపుతారు. విమానం, డెకాయ్ వ్యవస్థ మధ్య ఉండే ఫైబర్ ఆప్టిక్ ద్వారా రియల్ టైమ్‌లో మిస్సైల్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.