2027 Sankranthi : మళ్లీ బరిలోకి చిరు vs ప్రభాస్..మధ్యలో బాలయ్య?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 Sankranthi : టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల జాతర, 2026 సంక్రాంతి సందడి మొదలవ్వకముందే, అప్పుడే 2027 సంక్రాంతి బరిలో నిలబడబోయే సినిమాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పొంగల్ రేసులో టాలీవుడ్ అగ్ర హీరోలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వంగా తీస్తున్న సినిమా కావడంతో, ఇది పక్కాగా 2027 సంక్రాంతికి వస్తుందని టాక్. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయం.
READ ALSO: Priya Kapoor: రూ.30 వేల కోట్ల ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టు మెట్లేక్కిన వ్యాపారవేత్త రెండో భార్య!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అలాగే మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది, ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ జతకడుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పట్టాలెక్కనుంది. సంక్రాంతి అంటే విక్టరీ వెంకటేష్, కామెడీ అంటే అనిల్ రావిపూడి, వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్. ఇప్పటికే మూడు హిట్లు అందుకున్న వీరిద్దరూ, నాలుగో సినిమాతో 2027 సంక్రాంతికి వినోదాల విందు అందించేందుకు సిద్ధమవుతోంది. మరోపక్క నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో ఒక విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. సుజీత్ మేకింగ్ స్టైల్ నానికి ఎలా సెట్ అవుతుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉండే బలమైన ప్రాబబుల్స్ జాబితాలో ఉంది.
నందమూరి బాలకృష్ణ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తయితే సంక్రాంతికి లేదా అంతకన్నా ముందే అంటే 2026 డిసెంబర్‌లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే మాత్రం సంక్రాంతి బరిలోకి దిగడం పక్కా. ఈ లెక్కన ఈ ఐదు సినిమాల్లో కనీసం మూడు సినిమాలు ఖచ్చితంగా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఒకవేళ ఇదే జరిగితే, బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ఓ భారీ పోరును మనం చూడబోతున్నాం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!