Xi Jinping: జిన్‌పింగ్ అదృశ్యం.. ఈ ఆరుగురి నుంచే చైనా కొత్త అధ్యక్షుడు..
- జిన్‌పింగ్ అదృశ్యం, చైనా తదుపరి అధ్యక్షుడి గురించి చర్చ..
- ప్రముఖంగా వినిపిస్తున్న ఆరుగురు నేతల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మీడియా వ్యాప్తంగా వస్తున్న వార్తల ప్రకారం, త్వరలో జిన్‌పింగ్ గద్దె దిగిపోవడం ఖాయమని, కొత్తగా మరో అధ్యక్షుడు చైనా పగ్గాలు చేపడుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, తర్వాత చైనాకు కాబోయే అధ్యక్షుడుల్లో ఆరుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
జనరల్ జాంగ్ యూక్సియా:
జనరల్ జాంగ్ చైనా శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి ఉపాధ్యక్షుడు. చైనీస్ ఆర్మీలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి. మాజీ చైనా ప్రెసిడెంట్ హూజింటావోకు అనుచరుడిగా పేరుంది. జిన్‌పింగ్ తర్వాత ఇతడి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.
లి క్వియాంగ్:
లి క్వియాంగ్ ప్రస్తుతం చైనా ప్రధానిగా ఉన్నారు. 2023 నుంచి అధికారంలో ఉన్నారు. స్టేట్ కౌన్సిల్ అధిపతిగా చైనా ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తివంతమైన నేతగా పేరుంది.
డింగ్ షుజియాంగ్:
షి జిన్‌పింగ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన డింగ్‌ను ఆయన సన్నిహిత సహాయకుడిగా భావిస్తారు. జిన్‌పింగ్ పాలనాకాలంలో ఇతను శక్తివంతమైన నేతగా వేగంగా ఎదిగారు. జిన్‌పింగ్ ఆశీర్వాదాలు ఇతడికి ఉన్నాయని భావిస్తారు.
వాంగ్ హునింగ్:
ప్రస్తుతం వాంగ్ చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్. వాంగ్ పార్టీ ప్రధాన సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందారు. ఇతను ముగ్గురు అధ్యక్షుల కింద పనిచేశారు. అయితే, ఈయనకు పాలనా అనుభవం లేకపోవడంతో, ఇతను కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జావో లెజి:
అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మాజీ నాయకుడు. జావో పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో సీనియర్ సభ్యుడు, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
లి హాంగ్‌జోంగ్:
సీనియర్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేత. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లి హాంగ్‌జోంగ్ కూడా రేసులో ఉన్నారు. పార్టీ నిర్మాణం ఈయనకు మంచి పట్టు ఉందని చెబుతారు. జిన్‌పింగ్‌కు విశ్వాసపాత్రుడనే పేరు ఉంది.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..