MK Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులతో ముచ్చటించారు. విభజన సిద్ధాంతాలను స్వీకరించవద్దని వారిని హెచ్చరించారు. నాథూరామ్ గాడ్సే మార్గాన్ని తిరస్కరించాలని సూచించారు. ‘‘గాంధీ, అంబేద్కర్ మరియు పెరియార్ తీసుకున్న మార్గాలతో సహా మనకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ గాడ్సే గ్రూపు మార్గాన్ని తీసుకోకూడదు’’ అని ఆయన తిరుచ్చిలోని జమాల్ మొహమ్మద్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
Read Also: Air India Crash: ఇంజన్ “ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్” తప్పిదమే ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమా.?
రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేస్తుందనే ప్రచారంతో అధికార డీఎంకే పార్టీ 45 రోజుల రాష్ట్ర వ్యాప్తం ‘‘ఓరనియిల్ తమిళనాడు (తమిళనాడు ఒకటిగా) ప్రచారాన్ని ప్రారంభించింది. బలమైన తమిళనాడును నిర్మించడంలో ఐక్యత, సామాజిక న్యాయం, శాస్త్రీయ పురోగతి ప్రాముఖ్యలను స్టాలిన్ విద్యార్థులకు చెప్పారు. తమిళనాడు ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఓడించలేరని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జూలై 3న రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 234 అసెంబ్లీలను కవర్ చేయాలని డీఎంకే ప్లాన్ చేసింది.