DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని సీఎం సిద్ధరామయ్య ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Tesla: భారతదేశంలోకి ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జూలై 15న భారత్‌లో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ముంబైలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భారత మార్కెట్లోకి టెస్లా అధికారికంగా ప్రవేశించబోతోంది. ముంబైలోని ప్రముఖ వ్యాపార జిల్లా అయిన అప్స్కేల్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఉన్న షోరూంలో సందర్శకుల కోసం టెస్లా ఎలక్ట్రిక్ కార్లు, దాని టెక్నాలజీని తెలుసుకునేందుకు అవకాశం అందిస్తోంది. అయితే, టెస్ట్ డ్రైవ్, వాహన డెలివరీలు అందుబాటులో ఉండదని…
Pinaka-IV: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటింది. భారత స్వదేశీ తయారీ ఆయుధాలైన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ ముందు, పాకిస్తాన్ డ్రోన్లు, చైనా తయారీ మిస్సైళ్లు తట్టుకోలేకపోయాయి. స్కై స్ట్రైకర్ డ్రోన్లు పాకిస్తాన్ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. భారత్ కొట్టిన దెబ్బ ఇటు పాకిస్తాన్‌కు అటు చైనాకు మింగుడుపడటం లేదు.
Radhika Yadav: 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ హత్య సంచలనంగా మారింది. సొంత తండ్రి కూతురిని కాల్చి చంపాడు. ఘటన సమయంలో ఇంట్లో రాధికాయాదవ్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తోంది. ఈ సమయంలోనే వెనక నుంచి కాల్చి చంపాడు. అయితే, కూతురి ఆదాయంపై ఆధారపడుతున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో, ఆమె తండ్రి 49 ఏళ్ల దీపక్ యాదవ్ ఆర్థిక పరిస్థితి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Rare-earths: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై చైనాపై ఆధారపడకుండా భారత్ మాస్టర్ ప్లా్న్ సిద్ధం చేస్తోంది. ముక్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లోని మోటర్స్‌లో ఉపయోగించే రేర్ ఎర్త్ అయస్కాంతాలపై చైనా దేశంపై అతిగా ఆధారపడొద్దని భారత్ నిర్ణయించుకుంది. ప్రపంచంలో ప్రస్తుతం రేర్ ఎర్త్ మూలకాలు, అయస్కాంతాల ఉత్పత్తిలో చైనా నియంతృత్వం కొనసాగుతోంది. దీంతోనే, భారత్ 25 బిలియన్ రూపాయలు ($290 మిలియన్లు) విలువైన ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. ఇది ఈ అయస్కాంతాలను తయారు చేసేలా పెద్ద ప్రైవేట్ కంపెనీలను ఆకర్షిస్తుంది.
Sir Ganga Ram: పాకిస్తాన్ వంటి దేశానికి మతోన్మాదం, ఉగ్రవాదమే ముఖ్యం. ముఖ్యంగా భారత్ అన్నా, హిందువులన్నా ద్వేషం. కానీ ఒక్క హిందువును మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తోంది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయినప్పటికీ పాకిస్తాన్లో ఆయన ఉనికి శాశ్వతంగా ఉంది. ఆయన మరెవరో కాదు సర్ గంగా రామ్. 1921లో లాహోర్‌లో ఆస్పత్రిని నిర్మించిన సివిల్ ఇంజనీర్, దాత. ఇప్పటికీ ఈ ఆస్పత్రి పాకిస్తాన్లో ప్రతీ రోజు వేల మందికి చికిత్స అందిస్తోంది. జూలై 10న ఆయన వర్ధంతి.
Kapil Sharma: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో కేఫ్ ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. కనీసం, 9 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు బాధ్యత వహించారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
Tata Motors: వినియోగదారులకు టాటా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా మోటార్స్ తన ఈవీ వాహనాలపై లైఫ్ టైమ్ హై-వోల్టేజ్ (HV) బ్యాటరీ వారంటీని అందించనున్నట్లు ప్రకటించింది. టాటా కర్వ్.ev కూపే, నెక్సాన్ evల 45kWh బ్యాటరీ ప్యాక్ మోడళ్లు ఈ వారంటీ కిందకు వస్తాయి. భారతదేశంలో ఈవీ కార్ల వినియోగం పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత పెంచడానికి ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కొనుగోలుదారులతో పాటు, ఈ మోడళ్లను మొదటిసారి కొనుగోలు చేసిన వారికి ఈ వారంటీని అందిస్తోంది.
Rafale jets: జిత్తులమారి చైనా, ఎప్పటికప్పుడు వేరే దేశాల ఆయుధాలను కాపీ కొడుతూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలను తయారు చేస్తుంటుంది. అయితే, తాజాగా జరిగిన సంఘటన చూస్తే మరోసారి అదే పనిలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెంచ్ తయారీ రాఫెట్ ఫైటర్ జెట్ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు చైనా జాతీయులను గ్రీస్ దేశంలో అరెస్ట్ అయ్యారు. గ్రీస్‌లోని తనగ్రాలో రాఫెల్ ఫైటల్ జెట్స్ ఫోటోలు తీసినందుకు, హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(HAI) ఫెసిలిటీని చిత్రీకరించినందుకు […]
Russia: ప్రపంచంలో పలు దేశాలు భారతీయ కార్మికులు, ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. యూఏఈ, ఖతార్, ఇజ్రాయిల్ వంటి దేశాలు భారతీయ కార్మికులను నియమించుకుంటున్నాయి. అక్కడి భవన నిర్మాణ రంగాల్లో, వస్త్ర పరిశ్రమ, వ్యవసాయం, ఇతర పరిశ్రమల్లో భారతీయులను రిక్రూట్ చేసుకుంటున్నారు. యూకే, అమెరికా వంటి దేశాలు భారతీయ వృత్తి నిపుణులను ఆహ్వానిస్తున్నాయి.