Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్‌కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబాగా పిలిచే వ్యక్తి అసలు నిజ స్వరూపం వెలుగులోకి వస్తోంది. మతమార్పిడే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్‌ని కలిగి ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఏకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ‘లవ్ జిహాద్’ కోసం ఆపరేట్ చేస్తున్నట్లు తెలిసింది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గ్రామంలోని ఛంగూర్ బాబాకు చెందిన విలాసవంతమైన భవనంలో సోదాలు చేయగా, విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యంగా, మతమార్పిడే లక్ష్యంగా పెద్ద ఎత్తున్న సమన్వయంతో ఈ ముఠా పనిచేస్తున్నట్లు తేలింది. హిందూ, సిక్కు మహిళల్ని ‘‘లవ్ జిహాద్’’ ద్వారా మతం మారిస్తే, వారిని మతం మార్చిన వారికి లక్షల రూపాయాల్లో అప్పగిస్తున్నట్లు తేలింది. హిందూ, సిక్కు మహిళల్ని ఇస్లాంలోకి మార్చడానికి ప్రలోభపెట్టే నెట్వర్క్‌ని యూపీ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. హిందూ మతంలో కులాల వారీగా అమ్మాయిలను, మహిళలను మతం మారిస్తే ఒక్కో రేటు ఫిక్స్ చేసినట్లు తేలింది. లవ్ చేసినట్లు నటిస్తూ, పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాంలోకి మార్చుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉన్నట్లు తేలింది. ఏకంగా ఇది రూ. 100 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నట్లు తేలింది.
పోలీస్ దర్యాప్తు వివరాల ప్రకారం, సిక్కు మహిళ, బ్రహ్మణ, క్షత్రియ మహిళల్ని ఇస్లాంలోకి మారిస్తే రూ. 15 లక్షలు, హిందూ మతంలోని ఓబీసీలకు రూ. 10-12 లక్షలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన అమ్మాయిలను లవ్ జిహాద్ ద్వారా మతం మారిస్తే రూ. 8 లక్షలు ఇస్తున్నట్లు తేలింది. సోదాల సమయంలో ఛంగూర్ బాబా డైరీని పరిశీలిస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బాబా 40 ఇస్లామిక్ దేశాలను పర్యటించినట్లు తేలింది. లవ్ జిహాద్, మతమార్పిడికి కావాల్సిన డబ్బులు ఈ దేశాల్లోని మతోన్మాద సంస్థల నుంచి వస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం, ఛంగూర్ బాబా నెట్వర్క్‌ని ఎన్ఐఏ, ఈడీ, యూపీ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) విచారిస్తోంది.