టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం..బీజేపీ గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ఒకసారి టీఆర్ఎస్ ఓడిపోతే మళ్లీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. గోల్ మాల్ చేయాలనుకున్నప్పుడు..ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తాడని విమర్శించారు. కేసీఆర్ కు నేను..నా కుటుంబమనే ఆహం పెరిగిందని అన్నారు. […]
రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగులు యువతిపై ఏదో విసిరి పారిపోయారని తమకు కాల్ వచ్చిందని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మహిళను ఎయిమ్స్ ట్రామా […]
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్రయోజనాలకు పాకులాడే వ్యక్తి అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అక్కడే కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్ లేదు.. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు మహేంద్ర నాథ్ పాండే. ఇక్కడ గెలవలేని వారు జాతీయస్థాయిలో వెలుగుతారా.? అని ప్రశ్నించారు. ఆయనతో దేశం ఎలా ముందుకు వెళ్తుందని అడిగారు. […]
తెలంగాణలో ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీస్ కు అధికారులుగా ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు కలెక్టర్ గా పదోన్నతి పొందారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ఏ. శరత్, సిద్ధిపేట కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, గద్వాల కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నల్గొండ కలెక్టర్ గా రాహుల్ శర్మ, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా వరణ్ […]
ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి […]
టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుతూనే ఉంది. ఇటీవల కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే విషయం చర్చకు రావడంతో బీజేపీ విమర్శలకు దిగింది. అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలనంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రధాని కావాలని అందరికీ కోరిక ఉంటుందని, 2024లో కూడా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రి అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర […]
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కాంగ్రెస్ అధినేత్రికి ఇటీవల సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఈ లోపే ఆమె కరోనా బారిన పడ్డారు. నిజానికి ఈనెల 8 సోనియా గాంధీ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆమెను జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తాజా నోటిసులు జారీ చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఈడీ […]
కేంద్ర గ్రీన్ ఎనర్జీ వైపు దృష్టి సారిస్తోంది. దీని కోసం దశల వారీగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించే ప్లాన్ లో ఉంది. నాలుగేళ్లలో కనీసం 81 బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాలని లక్ష్యం పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు యూటీలకు లేఖ రాసింది. థర్మల్ విద్యుత్ స్థానంలో సోలార్, విండ్ పవర్ ను ప్రోత్సహించనుంది. దీని ద్వారా బొగ్గు దిగుమతిని నిలిపివేయడంతో పాటు […]
భూమి గురించి ఎంత తెలుసుకున్నా.. ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇన్నాళ్లు మనం భూమి మధ్యలో పెద్ద ఐరన్ కోర్ భూమికి భ్రమణానికి వ్యతిరేఖ దిశలో తిరుగుతుందని మనందరికీ తెలుసు. భూమి ఇన్నర్ కోర్ సాలిడ్ గా ఉండీ, ద్రవరూపంలో ఉండే ఐరన్ లో తిరుగుతుండటంతో ఇది జెనరేటర్ గా పనిచేస్తూ బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తోంది. భూ అయస్కాంత క్షేతం( జియో మాగ్నిటిక్ ఫీల్డ్) వల్లే గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఈ బలమైన అయస్కాంత క్షేత్రమే […]
బీజేపీ గురించి ఇతర దేశాల రాయబారులు తెలుసుకునే విధంగా ‘ బీజేపీని తెలుసుకోండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రజాస్వామ్య దేశాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ గురించి దేశాల రాయబారులు తెలుసుకునేలా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు దేశాల రాయబారులతో సమావేశం అయ్యారు. శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యలయలో 13 దేశాలకు చెందిన రాయబారులతో జేపీ నడ్డా సమావేశం అయ్యారు. బీజేపీ చరిత్ర, అభివృద్ధి పయనాన్ని తెలిపే డాక్యుమెంటరీని రాయబారులకు ప్రదర్శించారు. […]