బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం చెలరేగుతూనే ఉంది. గత వారం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదంపై ఇస్లామిక్ ప్రపంచం భారత్ కు తమ నిరసననను తెలియజేశాయి. ఖతార్, మలేషియా, ఇరాక్, యూఏఈ, సౌదీ ఇలా చాలా దేశాలు భారత రాయబారులకు నిరసన తెలిపాయి. దీనికి బదులుగా ఇండియాకు కూడా వివరణ ఇచ్చింది. వ్యక్తి గత వ్యాఖ్యలను ప్రభుత్వానికి […]
చత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 10 ఏళ్ల బాలుడు బోర్ బావిలో పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పిహ్రిద్ గ్రామంలో ఇంటి వెనకాలు ఉన్న పెరట్లో ఆడుకుంటున్నరాహుల్ సాహు అనే బాలుడు నిరుపయోగంగా ఉన్న బావిలో జూన్ 10న పడిపోయాడు. అప్పటి నుంచి బాలుడిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు సాగుతున్నాయి. దాదాపుగా 62 అడుగుల లోతులో ఇరుక్కున్నాడని రెస్య్కూ సిబ్బంది చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్), […]
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటీవల కాలంలో దాదాపుగా రోజు ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని బెమీనా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి బలగాలు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులను నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. గతంలో సోపోర్ ఎన్ […]
మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు దేశం లోపల, బయట రచ్చకు కారణం అయ్యాయి. పలు ఇస్లామిక్ దేశాలు భారత్ కు తన నిరసన వ్యక్తం చేశాయి. అయితే భారత్ కూడా ఇదే స్థాయిలో వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని సూచించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బీజేపీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ క్షమాపణలు […]
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తమ అధినేత నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అధినేత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు. తాజాగా కేసీఆర్ నిర్ణయానికి ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరం అని వారంతా అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరంపై తెలంగాణ ఎన్నారై మహేష్ బిగాల ప్రపంచ […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని ఆయన అన్నారు. తాగునీరు, సాగునీరు, మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని.. విడిపోయి మన అభివృద్ధి చెందితే , వారు వెనుకపడి పోయారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు పోయి చూస్తే మన తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో తెలుస్తుందని ఆయన అన్నారు. కేంద్రం అన్ని ప్రభుత్వం ఆస్తులను […]
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. అరబ్ సమాజం కూడా ఈ వ్యాఖ్యలపై భారత్ కు తమ నిరసన తెలిపాయి. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను శిక్షించాలని అంటూ శుక్రవారం ప్రార్థనల తర్వాత పలు ప్రాంతాల్లో నిరసలు, ఆందోళనలు చెలరేగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో నిరసలు హింసాత్మకంగా మారాయి. పశ్చిమ బెంగాల్ హౌరాలో, జార్ఖండ్ రాంచీలో, యూపీ ప్రయాగలో హింసాత్మక ఘటనలు […]
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామనే వార్తలు వస్తున్న వేళ పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు, తెలంగాణలో పీకే టీం చేసిన సర్వే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. దాదాపు 3 గంటల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించేదుకు ఈ నెల 15న ఢిల్లీకి […]
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని […]
చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ‘ ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ లో బీసీల న్యాయపరమైన డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. […]