Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎంత క్రేజీగా ఉంటుందో.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు అంత ఆసక్తికరంగా ఉంటుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై, ధోనీ కెప్టెన్సీలో చెన్నై చెరో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 23, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఒక సరదా వీడియోను షేర్ చేసింది. ఇందులో దీపక్ చాహర్ తన పాత గురువు ఎంఎస్ ధోనీని కలవడానికి వెళ్లారు. చాహర్ వెనకాలే కెమెరామెన్ రావడం చూసి ధోనీ స్పందిస్తూ.. “నువ్వు వస్తూ వస్తూ నీతో పాటు కెమెరాను కూడా తీసుకొచ్చావు” అని సరదాగా అన్నారు. దానికి చాహర్ కూడా కెమెరామెన్తో.. “భయ్యా వెళ్ళిపోండి, మేము మాట్లాడుకోలేము” అని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత చాహర్ ధోనీ పాదాలకు నమస్కరించి తన గౌరవాన్ని చాటుకున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Cameraman be like… chalo theek hai 🫠 pic.twitter.com/KqzXsYc9h3
— Mumbai Indians (@mipaltan) April 22, 2026
గురువుకు ఎదురుగా శిష్యుడు..
దీపక్ చాహర్ ఐపీఎల్ కెరీర్ ధోనీ నాయకత్వంలోనే మొదలైంది. 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరపున ధోనీ కెప్టెన్సీలో ఆయన అరంగేట్రం చేశారు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బౌలర్‌గా ఎదిగారు. అయితే.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ చాహర్‌ను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ధోనీ రీ-ఎంట్రీ..?
ఈ మ్యాచ్‌లో అందరి కళ్ళు ధోనీపైనే ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ధోనీ ఫిట్నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ.. ముంబైతో జరిగే ఈ పెద్ద మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకప్పుడు ధోనీ శిష్యుడిగా ఉన్న చాహర్, ఇప్పుడు ముంబై తరపున ధోనీ జట్టుపై ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!