Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mint Sharbat: బయట ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడికైనా వెళ్తే చాలు ఎండ తీవ్రత, చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, అలసట ఆవహిస్తాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే, ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకునే పుదీనా షర్బత్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం చలవ చేయడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ ఎనర్జీ డ్రింక్‌ను సింపుల్‌గా మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పుదీనా షర్బత్‌కు కావాల్సిన పదార్థాలు:
తాజా పుదీనా ఆకులు: ఒక కప్పు
Also Read
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
నిమ్మరసం: ఒక నిమ్మకాయది
చక్కెర: 2-3 స్పూన్లు (రుచికి తగినంత)
చల్లని నీరు: ఒక గ్లాసు
నల్ల ఉప్పు (Black Salt): చిటికెడు
ఐస్ ముక్కలు: తగినన్ని
తయారీ విధానం:
ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, చక్కెర, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని, అందులో నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు, చల్లని నీరు పోసి బాగా కలపాలి. లాస్ట్‌లో ఐస్ ముక్కలు వేసుకుంటే చల్లచల్లని పుదీనా షర్బత్ రెడీ అవుతుంది.
పుదీనా షర్బత్‌తో ప్రయోజనాలు..
ఇది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. అలాగే పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్ గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిమ్మరసం, పుదీనా కలిపి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. అలసటను తగ్గిస్తుంది. రోజూ ఒక గ్లాసు ఈ షర్బత్ తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ ఎనర్జీ డ్రింక్‌ను మధ్యాహ్నం ఎండలో బయట నుంచి వచ్చినప్పుడు లేదా భోజనం చేసిన తర్వాత తాగడం ఉత్తమం. మీకు ఎసిడిటీ సమస్య ఉంటే, పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండి, తక్కువ ఖర్చుతో, రెండు నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ డ్రింక్‌ను ఇప్పుడే మీ డైట్‌లో భాగం చేసుకోండి మరి.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!