మానవుడి నాగరికత, టెక్నాలజీ భూమికి ప్రమాదాన్ని తీసుకువస్తోంది. తాజాగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కెనడాలోని వాటర్లు యూనివర్సిటీ శాస్త్రవేత్త క్వింగ్ బిన్ లూ వెల్లడించారు. ఈ రంధ్రం దిగువ స్ట్రాటో ఆవరణంలో ఏర్పడినట్లు గుర్తించారు. కొత్తగా కనుగొనబడిన ఈ ఓజోన్ హోల్ గత 30 ఏళ్లుగా […]
మహారాష్ట్రలో అమరావతి ఉమేష్ కోల్హే హత్య కేసులో ఎన్ ఐ ఏ దూకుడు పెంచింది. ఏకంగా మహారాష్ట్రలోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జూన్ 21న అమరావతిలో ఫార్మాసిస్ట్ ఉమేష్ కోల్హేను దుండగులు దారుణంగా హత్య చేశారు. సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్లే ఉమేష్ కోల్హేను హత్య చేశారని తెలిసింది. తాజాగా బుధవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించి అనుమానితులు, నిందితుల ఇళ్లలో డిజిటల్ పరికరాలు (మొబైల్ ఫోన్లు, […]
ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ షాపింగ్ ఫెస్టివల్ ను ఢిల్లీలో నిర్వహించనున్నారు. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. 2023 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 30 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనుంది […]
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వివాహం అయిన 48 ఏళ్ల మాన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తన భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చాడు సీఎం మాన్. అయితే తాజాగా మరో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో చంఢీగడ్ లో వివాహం జరగనుంది. పంజాబ్ లో తొలిసారి పాగా వేసిన ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి […]
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ మెదడును కూడా ప్రభావితం చేస్తోంది. మనం వ్యాధినిరోధక వ్యవస్థ కరోనా వైరస్ తో పోరాడుతున్న క్రమంలో మన మెదడును దెబ్బతీస్తోందని తాాజా అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) ఈ అధ్యయాన్ని నిర్వహించింది. కరోనా బారిన పడి మరణించిన తొమ్మిది మందిపై ఈ అధ్యయనాన్ని చేశారు. చనిపోయిన 9 మంది మెదడులో మార్పులు వచ్చినట్లు గమనించారు పరిశోధకులు. మన ఇమ్యూన్ సిస్టం తప్పుగా పొరబడి మెదడు రక్త నాళాలను […]
సాధారణంగా ఈగల వల్ల వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురువుతుంటారు మనుషులు. చాలా వరకు వర్షాకాలంలో ఈగల వల్ల వచ్చే వ్యాధులు తీవ్రంగా ఉంటాయి. అయితే నైరోబీ ఈగల వల్ల మాత్రమ మనుషుల చర్మం తీవ్రంగా ఇన్ఫెక్షన్ కు గురువుతుంది. అలాంటి తాజాగా సిక్కింతో వందకు పైగా విద్యార్థులు నైరోబీ ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఈగలు మనుషులను తాకితేనే చర్మం విపరీతమైన ఇన్పెక్షన్ కు గురువుతుంది. తూర్పు సిక్కింలోని సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ […]
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అవిశ్వాసం నుంచి గట్టెక్కిన బోరిస్ జాన్సన్ సర్కార్ కు ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో బోరిస్ జాన్సన్ సర్కార్ సంక్షోభంలో పడింది. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా చేస్తున్న మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం రోజు మరో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. చిల్డ్రన్, ఫ్యామిలీ మినిస్టర్ విల్ క్వీన్ తో పాటు రవాణా మంత్రి లారా ట్రాట్, ఆర్థిక సేవల మంత్రి జాన్ గ్లేర్, మరో […]
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, బీజేపీ కీలక నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమి నుంచి ఉపరాష్ట్రపతి పోటీలో నిలిచేందుకే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఉపరాష్ట్రపతి పదవకి నఖ్వీ పోటీ చేస్తారని ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా నఖ్వీ రాజ్యసభ కాలపరిమితి రేపటితో ముగుస్తోంది. దీంతో ఆయన ఇటు రాజ్యసభ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. నక్వీతో పాటు కేంద్ర […]
ఇటీవల వరసగా పలు విమానాలు సాంకేతిక లోపాలతో ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. స్పైస్ జెట్ కు సంబంధించిన విమానాలు ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. లక్కీగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలో జరిగింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం యూకే-122 సింగిల్ ఇంజిన్ తోనే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో […]
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆప్ఘనిస్తాన్ కు చెందిన ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా యోలా పట్టణంలో చోటు చేసుకుంది. ఆప్థనిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల మత గురువును యోలా పట్టణంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్ లో మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. హతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించారు. ఆ ప్రాంతంలో హతుడు సూఫీ బాబాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే హత్యకుగల […]