ఇటీవల వరసగా పలు విమానాలు సాంకేతిక లోపాలతో ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. స్పైస్ జెట్ కు సంబంధించిన విమానాలు ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. లక్కీగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలో జరిగింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం యూకే-122 సింగిల్ ఇంజిన్ తోనే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ప్రయాణికులు అంతా క్షేమంగా బయటపడ్డారు.
Read Also: DGCA: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు
ల్యాండింగ్ తరువాత రన్ వే నుంచి టాక్సీ బేకు వెళ్లున్న క్రమంలో ఇంజిన్ 2లో సాంకేతిక సమస్య ఏర్పడిందని..విస్తారా ప్రతినిధి వెల్లడించారు. దీనిపై డీజీసీఏ విచారణ జరుపుతోంది. గత 18 రోజుల్లో ఎయిల్ లైన్స్ కు చెందిన 8 విమానాల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన పలు విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. దీనిపై డీజీసీఏ స్పైస్ జెట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించేందుకు డీజీసీఏ, స్పైస్ జెట్ కు మూడు వారాల గడువు ఇచ్చింది.