సాధారణంగా ఈగల వల్ల వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురువుతుంటారు మనుషులు. చాలా వరకు వర్షాకాలంలో ఈగల వల్ల వచ్చే వ్యాధులు తీవ్రంగా ఉంటాయి. అయితే నైరోబీ ఈగల వల్ల మాత్రమ మనుషుల చర్మం తీవ్రంగా ఇన్ఫెక్షన్ కు గురువుతుంది. అలాంటి తాజాగా సిక్కింతో వందకు పైగా విద్యార్థులు నైరోబీ ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఈగలు మనుషులను తాకితేనే చర్మం విపరీతమైన ఇన్పెక్షన్ కు గురువుతుంది.
తూర్పు సిక్కింలోని సిక్కిం మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఎంఐటీ) క్యాంపస్ లో ఈ నైరోబీ ఈగల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు తీవ్రమైన చర్మ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇటీవల ఈగల వల్ల ఓ విద్యార్థికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి వచ్చింది. తూర్పు ఆఫ్రికాకు చెందిన ఈ ఈగలు మనదేశంలో చాలా అరుదు. సంతానోత్పత్తి కోసం, ఆహారం కోసం కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ వస్తాయి. సాధారణంగా ఇవి పంటలను నాశనం చేస్తాయని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Read Also: Viral: పది వేల ఇళ్లకు కరెంట్ కట్ చేసిన పాము..! ఎలాగో తెలుసా..?
సాధారణంగా ఈ నైరోబీ ఈగలు కుట్టవు కానీ.. చర్మంపై వాలినప్పుడు పవర్ ఫుల్ యాసిడ్లు విడుదల చేస్తాయి. దీంతో చర్మం ఇన్ఫెక్షన్ కు గురువుతుంది. ఈగలు వాలిన శరీర భాగాలను సబ్బుతో, నీటితో కడగాలి. ప్రస్తుతం విద్యార్థలందరికీ చికిత్స జరుగుతోందని త్వరలోనే కోలుకుంటారని అధికారులు తెలిపారు. క్యాంపస్ లో పరుగుల మందుల్ని పిచికారి చేస్తున్నారు.