Ozone Layer: ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రం.. భూమికి పొంచి ఉన్న ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవుడి నాగరికత, టెక్నాలజీ భూమికి ప్రమాదాన్ని తీసుకువస్తోంది. తాజాగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కెనడాలోని వాటర్లు యూనివర్సిటీ శాస్త్రవేత్త క్వింగ్ బిన్ లూ వెల్లడించారు. ఈ రంధ్రం దిగువ స్ట్రాటో ఆవరణంలో ఏర్పడినట్లు గుర్తించారు. కొత్తగా కనుగొనబడిన ఈ ఓజోన్ హోల్ గత 30 ఏళ్లుగా ఉష్ణమండలంపై ఉన్నట్లు వెల్లడించారు.
సాధారణంగా ఓజోన్ అంటే మూడు ఆక్సిజన్ అణువుల సమ్మేళనంగా (ఓ3). ఇది సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి భూమిని, భూమిపై జీవరాశిని రక్షిస్తోంది. భూమి ఎగువ వాతావరణంలో ఒక పొరలా ఉండీ భూమిని రక్షిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా రంధ్రాలు అంటే ఆ ప్రాంతంలో ఓజోన్ లేకపోవడం అని చెప్పవచ్చు. గడిచిన కొన్ని దశాబ్ధాలుగా ఓజోన్ లేయర్ పలుచబడిపోతుందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
Read Also: Rajya Sabha: పెద్దల సభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..
ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణం క్లోరోఫ్లోరో కార్బన్స్(సిఎఫ్‌సి). కూలింగ్ యూనిట్లలో ప్రధానంగా ఈ గ్యాస్ వాడుతారు. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్ లలో ఈ గ్యాస్ వాడతారు. వీటి నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ లేయర్ క్షీణతకు కారణం అవుతున్నాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్ లతో ఓజోన్ గ్యాస్ రసాయనిక చర్య వల్ల ఆక్సిజన్, క్లోరిన్ వాయువులు ఏర్పడుతాయి. ఫలితంగా ఓ3 వాయవు ఆ ప్రాంతంలో ఉండదు. దీంతో సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర కిరణాలు భూమిపై పడుతాయి.
ఓజోన్ పొర క్షీణత వల్ల యూవీ రేడియేషన్ పెరుగుతుంది. ఫలితంగా ఇది చర్మ క్యాన్సర్లకు, కంటిపై ప్రభావానికి కారణం అవుతుంది. దీంతో పాటు మానవుడి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యవసాయ పంటల ఉత్పాదకతను తగ్గిస్తుంది. జలచర జీవులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!