మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఉదంత మరిచిపోక ముందే మరో ఎంపీ కాళీ మాత వివాదంలో చిక్కుకుంది. త్రుణమూల్ కాంగ్రెస్ ఎపీ మహువా మోయిత్రా, కాళీ మాతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమెను అరెస్ట్ చేయాలంటూ బెంగాల్ బీజేపీ నేతలు మమతా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెస్ట్ బెంగాల్ […]
పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్ వివాహం జరగనుంది. తన ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం జరగనున్నట్లు తెలిసింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది. భగవంత్ మాన్ కి ఇది రెండో పెళ్లి, 48 ఏళ్ల […]
కాళి అమ్మవారిని సిగరేట్ తాగుతూ చూపించడాన్ని హిందు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో టోరంటోలోని అగాఖాన్ మ్యాజియం హిందువుల మత విశ్వాసాలను కించపరిచేందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒట్టావాలోని భారత మిషన్, కెనడాలోని అధికారులు వివాదస్పద చిత్రాన్ని తొలిగించాలని కోరడంతో ‘ కాళి’ డాక్యుమెంటరీ ప్రదర్శనను తీసివేసినట్లు తెలిపింది. టొరంటోకు చెందిన చిత్రనిర్మాత మణిమేకలై శనివారం ‘ కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ ను ట్విట్టర్ లో పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇందులో కాళి అవతారంలో ఉన్న […]
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన రెండు మామిడి చెట్లకు ముగ్గురు గార్డులను, 6 వాచ్డాగ్లను సెక్యురిటీగా పెట్టాడు. మీరు వింటున్నది నిజమే.. మామిడి చెట్లకు అది కూడా రెండింటికి ఇంత సెక్యురిటీ ఎందుకా.. అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే ఇది అలాంటి ఇలాంటి మామిడి చెట్లు కావు. అరుదైన, అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి చెట్లు. మియాజాకి మామిడి పండ్ల ధర కేజీకి రూ. 2.7 లక్షలు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ రైతు తన […]
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలో విస్తరించడంతో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 4న రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంచిర్యాల, జగిత్యాల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు […]
మోటోరొలా నుంచి మోటో జీ 42 మొమైల్ సోమవారం ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మోటో జీ42 పోటీ ఇవ్వనుంది. గతేడాది యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయినా ఇండియాలో ఏడాది తరువాత లాంచ్ చేశారు. మోటో జీ42 20:9 ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ను కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా […]
బీహార్ లో పరువు హత్యకు స్కెచ్ వేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురునే హతమార్చేందుకు ప్రయత్నించాడు. తన కూతురును చంపేలా కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తి అయి ఉండీ..పరువు హత్యకు ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసుల ముందు గుట్టు విప్పడంతో సదరు ఎమ్మెల్యే క్రిమినల్ చర్య గురించి తెలిసింది. […]
మహారాష్ట్ర సంక్షోభం దాదాపుగా ముగిసింది. తాజాగా ఈ రోజు జరిగిన బలనిరూపనలో సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకున్నారు. దీంతో బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మహారాష్ట్రను మరో రెండున్నరేళ్ల పాటు పాలించనుంది. విశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహాారాష్ట్రలో 144 మెజారిటీ కావాలి. అయితే దీని కన్నా 20 మంది సపోర్ట్ షిండే వర్గం సాధించింది. షిండే […]
పక్కింటి వారి కుక్క తనపై మొరిగిందనే కోపంతో కుక్కతో, ముగ్గురిపై దాడి చేసిన ఘటన ఢిల్లీలోని పశ్ఛిమ విహార్ లో చోటు చేసుకుంది. ఇనుప రాడ్ తో కుటుంబంలోని ముగ్గురి వ్యక్తుల్ని తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా కుక్కను కూడా కొట్టాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. Read Also:Government of Tamil Nadu: కమల్ కు నోటీసులు.. ఎందుకంటే? పూర్తి వివరాల్లోకి వెళితే ధరమ్ వీర్ దహియా సోమవారం […]
దేశంలో కరోనా కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు ఇటీవల తెలంగాణలో కూడా కొన్ని రోజుల నుంచి 400కు పైగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల కరోనా వల్ల మరణాలను మాత్రం అదుపు చేయగలుగుతున్నాం. తాజాగా గడిచిన […]