Covid-19: మెదడు నాళాలను దెబ్బతీస్తున్న కోవిడ్.. రీసెంట్ స్టడీలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ మెదడును కూడా ప్రభావితం చేస్తోంది. మనం వ్యాధినిరోధక వ్యవస్థ కరోనా వైరస్ తో పోరాడుతున్న క్రమంలో మన మెదడును దెబ్బతీస్తోందని తాాజా అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) ఈ అధ్యయాన్ని నిర్వహించింది. కరోనా బారిన పడి మరణించిన తొమ్మిది మందిపై ఈ అధ్యయనాన్ని చేశారు. చనిపోయిన 9 మంది మెదడులో మార్పులు వచ్చినట్లు గమనించారు పరిశోధకులు. మన ఇమ్యూన్ సిస్టం తప్పుగా పొరబడి మెదడు రక్త నాళాలను దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. ఇమ్యున్ సిస్టమ్ లోని యాంటీబాడీస్ రక్త నాళాలను కప్పి ఉంచే కణాలపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఇది రక్త నాళాల వాపు, లీకేజీలకు కారణం అవుతుందని గుర్తించారు.
అయితే ఇక్కడ కరోనా వైరస్ నేరుగా మెదడుపై ప్రభావాన్ని చూపించడం లేదని.. ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మెదడు ప్రభావితం అవుతుందని పరిశోధకుడు అవీంద్ర నాథ్ వెల్లడించారు. చనిపోయిన వారికి శవపరీక్షలు చేయగా.. మెదడులోని రక్తనాళాలు ప్రభావితం అయినట్లుగా గుర్తించామని వెల్లడించారు. మొదట్లో దీనికి కారణం ఏమిటో అర్థం కాలేదని.. తర్వాత మన ఇమ్యున్ సిస్టమ్ కణాలే రక్త నాళాలపై దాడి చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Read Also: Ponniyan Selvan: పగతో రగులుతున్న ఐశ్వర్యరాయ్.. ఎవరిపైనంటే..?
కోవిడ్ వైరస్ కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేయబడిన యాంటీబాడీస్ మెదడులోని నాళాలను ప్యాక్ చేసే ఎండోథెలియల్ కణాలను దెబ్బతీస్తున్నాయని తేలింది. మెదడుకు హానికరమైన పదార్థాలు చేయకుండా ఎండోథెలియల్ కణాలు అడ్డుపడుతుంటాయి. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ కణాలు ఈ ఎండోథెలియల్ కణాలను దెబ్బతీయడం వల్ల రక్తం నుంచి ప్రొటీన్లు లేకేజీ అవుతాయి. దీంతో మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావానికి కారణం అవ్వడంతో పాటు స్ట్రోక్ కు కారణం అవుతోందని పరిశోధనల్లో తేలింది. 24 నుండి 73 సంవత్సరాల వయస్సు గల తొమ్మిది మందిపై ఈ అధ్యయనం చేశారు.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!