హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులోని జంగ్లా ప్రాంతంలోని సైంజ్ లోయలో ప్రైవేటు బస్సు పడింది. బస్సు లోయలో పడటంతో నుజ్జనుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 12 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో స్కూలు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. కులు నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలను చేపడుతున్నారు. కులు డిప్యూటీ […]
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును జూలై 4కు వాయిదా వేసింది. దీంతో […]
ఇటీవల కాలంలో తరుచుగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో ఇండియాలో రెండుసార్లు స్పైస్ జెట్ విమానాలు టెక్నికల్ సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే తాాజాగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ కు వెళ్తున్న ఎయిర్ బస్ ఏ3780 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జూలై 1న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ ఎయిర్ బస్ విమానం బ్రిస్బేన్ కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ఎడమ రెక్కకు […]
ఈజిప్టులో దారుణం జరిగింది. సరదాగా సముద్రంలో ఈత కొడుతున్న ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసి చంపేశాయి. చనిపోయిన ఇద్దరు మహిళలు ఈజిప్టుకు టూరిస్టులుగా వచ్చిన వారు. ఈ విషయాన్ని ఈజిప్టు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో ఎన్న సహాల్ హషీఫ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు మహిళలు సముద్రంలో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వారిపై షార్క్ అటాక్ చేసింది. చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు […]
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక […]
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక, బలనిరూపణ కోసం మహారాష్ట్ర అసెంబ్లీ జూలై 3,4 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ రోజు ఏక నాథ్ షిండే బలనిరూపణ పరీక్ష జరగనుంది. దీంతో ఈ రోజుతో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. షిండే ప్రభుత్వం సులభంగానే మెజారిటీని ప్రూవ్ […]
డెన్మార్క్ కాల్పులతో ఉలిక్కిపడింది. రాజధాని కోపెన్హాగన్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఆదివారం బిజీగా ఉండే మాల్ లోకి ప్రవేశించిన దుండగులు రైఫిల్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో ఒకరు నలబై ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా.. మరో ఇద్దరు యువకులని డానిష్ పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే డెన్మార్క్ లో కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు […]
జమ్మూ కాశ్మీర్ లో నెమ్మనెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. గతంలో టెర్రరిస్టులకు గ్రామాల్లో ఆశ్రయం కల్పించే వారు అక్కడి ప్రజలు. గ్రామాల్లో షెల్టర్ తీసుకుంటూ సైన్యం, పోలీసులు, అమాయక ప్రజలపై దాడులు చేసేవారు. అయితే తాజాగా ఆదివారం రోజు కాశ్మీర్ లోని ఓ గ్రామం ప్రజలు ఇద్దరు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలకు పట్టించారు. రియాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలు ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి రెండు ఏకే రైఫిళ్లు, […]
భారత్ లో మతస్వేచ్ఛపై పదేపదే విషాన్ని గుప్పిస్తున్న యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం ( యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ ఘాటుగా స్పందించింది. జూలై 2న భారత్ కు వ్యతిరేఖంగా ఈ సంస్థ పలు ట్వీట్లను పెట్టింది. భారత్ లో ప్రశ్నించే గొంతులను, ముఖ్యంగా మైనారిటీల అణచివేత కొనసాగుతోందని.. దీనిపై వారంతా ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేసింది. దీంట్లో ఇటీవల ముంబైకి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ గురించి కూడా కమిషన్ ప్రస్తావించింది. భారతదేశంలో […]
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయి 2002లో గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లు. ఈ అల్లర్ల చుట్టూ రాజకీయం ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయోధ్య నుంచి వస్తున్న 59 మంది కరసేవకులను ఉన్న రైలు బోగీని కాల్చేయడంతో వారంత మరణించారు. ఈ ఘటన ఫిబ్రవరి, 2002లో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం గుజరాత్ వ్యాప్తంగా మతకలహాలు జరిగాయి. తాజాగా గోద్రా అల్లర్ల కేసులో నిందితుడు రఫిక్ బతుక్ జీవిత ఖైదు విధించించారు పంచమహల్ […]