పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార బీజేపీని ఎదుర్కోవడానికి మాటల యుద్ధానికి పనిచెప్పడానికి విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నాయి. చాలా సార్లు పార్లమెంట్ సమావేశాల్లో వాడీవేడీ చర్చల సందర్భంగా సభ్యులు కొన్ని పదాలను వాడుతుంటారు. అయితే అవి అభ్యంతరకర పదాలు, వ్యాఖ్యలు అయితే సభ రికార్డుల నుంచి తొలగిస్తారు. అయితే ఈ పదాల నిషేధంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్రుణమూల్ ఎంపి డెరిక్ ఓబ్రెయిన్ అయితే ఖచ్చితంగా ఈ పదాలను వాడుతాను..దమ్ముంటే సస్పెండ్ చేయండి అంటూ బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.
అయితే తాజాగా కొన్ని పదాలను పార్లమెంట్ సమావేశాల్లో వాడకుండా అన్ పాార్లమెంటరీ పదాలుగా లోక్ సభ సెక్రటేరియట్ కొత్త బుక్ లెట్ లో ప్రచురించారు. వీటిలో ‘జుమ్లా జీవి’, ‘బాల్ బుద్ధి’, ‘స్నూప్ గేట్’ వంటి పదాలు వాడకుండా నిషేధించింది. సాధారణంగా సభ్యులు ప్రతీ సారి విమర్శల కోసం వాడే.. ‘సిగ్గు చేటు’, ద్రోహం, అవినీతి, నాటకం, వంచన, అసమర్థుడు వంటి పదాలను కూడా లోక్ సభ సెక్రటేరియట్ కొత్త బుక్ లెట్ లో అన్ పార్లమెంటరీ వర్డ్ గా పేర్కొన్నారు. అరాచక వాది, శకుని, ద్రోహ చరిత్ర, నికమ్మ, నౌతంకి, నియంతృత్వం, తానిషా, తానాషాహి, జై చంద్, వినాష్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ వంటి పదాలను ఉభయ సభల్లో ఉపయోగిస్తే అన్ పార్లమెంటరీ పదాలుగా ఇకపై వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. అయితే ఈ పదాలను తొలగించడంలో రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ కు అధికారం ఉంటుంది.
Read Also: cobra inside a shoe: షూలో దూరిన నాగుపాము.. వీడియో వైరల్
వీటితో పాటు కొన్ని ఇంగ్లీష్ పదాలను కూడా అన్ పార్లమెంటరీ వర్డ్స్ అని సెక్రటేరియటర్ జాబితాలో పేర్కొన్నారు. బ్లడ్ పెడ్, బ్లడీ, బిట్రేట్, షేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, వీటితో పాటు చంచా, చంచాగరి, అవినీతి, పరికివాడు, నేరస్తుడు, మొసలికన్నీరు, అవమానం గాడిద, డ్రామా, కళ్లజోడు, గుండాయిజం, కపటత్వం, అసమర్థత, అబద్ధం, అసత్యం, గద్ధర్ వంటి పదాలు వాడితే అన్ పార్లమెంటరీ కింద రికార్డుల నుంచి ఈ పదాలను తొలగించనున్నారు.