cobra inside a shoe: షూలో దూరిన నాగుపాము.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా సరీసృపాల ఆవాసాలైన పుట్టలు, బొరియలు వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్నాయి. కీటకాలు, పాములు వంటి వాటికి పాత వస్తువులు, చీకటి ప్రాంతాలు ఆవాసంగా మారుతున్నాయి. ఇళ్లలోకి వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సేఫ్ ప్లేసులను ఎంచుకుంటున్నాయి పాములు. తాజాగా ఓ నాగుపాము వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడా చోటు దొరకనట్లుగా ఓ నాగుపాము షూ లో దూరింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద షేర్ చేసింది. ప్రస్తుతం షూలో పాము దూరిన వీడియో వైరల్ గా మారింది.
‘‘ మీరు వర్షాకాలలో వీటిని విచిత్రమైన ప్రదేశాల్లో కనుగొంటారు. జాగ్రత్తగా ఉండండి. శిక్షణ పొందిన సిబ్బంది సహాయం తీసుకోండి’’ అంటూ సుశాంత నంద ట్విట్టర్ లో వీడియోతో పాటు కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ షూ నుంచి నాగుపామును బయటకు తీయడం గమనిస్తాం. ఎంతో నేర్పుగా ఆమె పామును షూ నుంచి బయట తీస్తుంది. బయటకు తీసే క్రమంలో పాము నుంచి వచ్చే బుస కట్టే శబ్ధం ఎంతో భయంకరంగా ఉంది.
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Explainer: వి*షం తింటున్నాం...! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
Read Also: Loan Apps :ప్రాణాలు తీస్తున్న లోన్ యాప్ లు..చేతులెత్తుస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
ప్రస్తుతం ఈ వీడియోకు 1.71 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన వాళ్లు స్నేక్ క్యాచర్ చేసిన సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు ఎంతో భయంకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వర్షాకాలంలో చీకటిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలను పాములు, తేళ్లు ఎంచుకుంటాయి. ముఖ్యంగా షూలు, బైక్ సీటు కింది ప్రాంతాల్లో పాములు దూరడాన్ని చాలా సార్లు చూశాం. వీటిని ఉపయోగించే సమయంలో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 11, 2022
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!