Harish Rao: 90 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకవచ్చారు. కింగ్ కోఠి ఆసుపత్రికి చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వారిని పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కి గల కారణాలు అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తోపాటు ఒక మంత్రికి కూడా సోయిలేదని విమర్శించారు. ఫుట్ బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్యార్థుల మీద లేదు.. ఫుట్ బాల్ ఆడడానికి ముఖ్యమంత్రి అయిదు కోట్లు ఖర్చు పెట్టాడు.. విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. విజన్ 2047 అంటూ సీఎం రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. ఇది విజన్ 2047 కాదు పాయిజన్ 2047 అని తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.
READ MORE: Cute Kids Conversation: నవ్వులు పూయిస్తిన్న ఇద్దరు చిన్నారుల సంభాషణ
కాగా.. బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి ఫుడ్ పాయిజన్ అయ్యి పలువురు విద్యార్థులు హాస్పిటల్ కు వచ్చారని సిబ్బంది తెలిపారు. శుక్రవారం రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు, విరోచనలు, కడుపునొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. పిడియాట్రిక్ వైద్యులు పిల్లలను పరీక్షించారు. డిఐడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్ గా ఉంది. పిల్లలందరికీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు..