Most Powerful Passports 2022: ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్టుల్లో జపాన్ పాస్‌పోర్ట్ తొలిస్థానంలో నిలిచింది. ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022ను వెల్లడించింది. జపాన్ దేశ పాస్‌పోర్ట్ ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా నిలువగా.. ఆ తరువాతి స్థానాల్లో వరసగా సింగపూర్, సౌత్ కొరియా, స్పెయిన్, ఫిన్లాండ్, ఇటలీ, లెక్సెంబర్గ్, ఆస్ట్రియా, డెన్మార్క్ దేశాలు తరువాతా స్థానాల్లో నిలిచాయి. జపనీస్ పాస్‌పోర్ట్ ద్వారా 193 దేశాలకు అవంతరాలు లేకుండా వెళ్లేందుకు ప్రవేశాన్ని కల్పిస్తోంది. సింగపూర్, సౌత్ కొరియాలు రెండు దేశాలు కూడా రెండో స్థానంలో నిలిచాయి.
రష్యా పాస్‌పోర్ట్ 50వ స్థానంలో ఉంది. రష్యా పాస్‌పోర్ట్ ద్వారా 119 దేశాలకు సులభంగా ప్రవేశం లభిస్తోంది. చైనా పాస్‌పోర్ట్ 69వ స్థానంలో నిలిచింది. దీంతో 80 దేశాలకు యాక్సెస్ లభిస్తోంది. భారతదేశ పాస్‌పోర్ట్ ఈ జాబితాలో 87వ స్థానంలో ఉంది. ఇండియా పాస్‌పోర్ట్ తో 57 దేశాలకు ఎలాంటి అవాంవతరాలు లేకుండా ప్రవేశం లభిస్తోంది. 2017లో పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఒక్క ఆసియా దేశం కూడా టాప్ 10 స్థానంలో లేదు. తాజాగా పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ జాబితాలో యూరపియన్ దేశాల ఆధిపత్యానికి ఆసియా దేశాలు గండికొట్టాయి. ఈ జాబితాలో యూకే 6వ స్థానంలో నిలిచింది, యూకే పాస్‌పోర్ట్ ద్వాారా 187 దేశాాల్లోకి ప్రవేశం సులభంగా లభిస్తోంది. ఇదే విధంగా యూఎస్ఏ పాస్‌పోర్ట్ ద్వారా 186 దేశాలకు ఈజీగా ప్రవేశం లభిస్తోంది. ఈ జాబితాలో యూఎస్ఏ 7వ స్థానంలో నిలిచింది.
Read Also: Business Headlines: 300 బిలియన్ డాలర్లకు చేరనున్న ఇండియా బయో ఎకానమీ!
ఇదిలా ఉంటే తాజాగా పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం.. ప్రపంచంలో అతి చెత్త పాస్‌పోర్ట్ గా ఆప్ఘనిస్తాన్ దేశ పాస్‌పోర్ట్ నిలిచింది. కేవలం 27 దేశాలు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ ద్వారా సులభంగా ప్రవేశాలను అనుమతిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ చివరగా 112వ స్థానంలో నిలిచింది. ఇరాక్, సిరియా, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, నేపాల్, నార్త్ కొరియా చివరి స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాన్ 109వ స్థానంలో ఉంది.