Rajat Kumar Comments on polavaram project: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వల్ల కడెం, కాళేశ్వరం కింద కొంత డ్యామేజ్ అయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కొంతమంది ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని.. 18 సంస్థలు చూసిన తర్వాత ఒకే చెప్పిన తర్వాత ప్రాజెక్టులు కడతారని ఆయన అన్నారు. కడెం, కాళేశ్వరం కింద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారిస్తోందని అన్నారు. ఐఎండీ, యూరో శాటిలైట్ తో వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నామని అన్నారు. 100 ఏళ్ల తరువాత భారీగా వర్షాలు కురిశాయని ఆయన అన్నారు.
Read Also: Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం
పంప్ హౌజుల రిపేర్లకు రూ. 400 కోట్లు అవుతుందని అంటున్నారని.. పంప్ హౌజులను ప్రాజెక్ట్ కట్టిన సంస్థనే రిపేర్ చేస్తుందని.. పంప్ హౌజ్ రిపేర్ చేయడానికి రూ. 20-25 కోట్లకు మించి కావని.. సెప్టెంబర్ కల్లా పంప్ హౌజులు రెడీ అవుతాయని ఆయన అన్నారు. పంప్ హౌజ్ దగ్గర పవర్ రిస్టోర్ అయ్యిందని తెలిపారు. వందేళ్లలో కురవని వర్షం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు మండలాల్లో కురిసిందని ఆయన వెల్లడిమంచారు. కడెం ప్రాజెక్ట్ కు ఇటీవలే మరమ్మతులు చేశామని..ప్రమాదం ఏం లేదని వెల్లడించారు. వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షం కురిసిందని.. క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని ఆయన అన్నారు.
కడెం ప్రాజెక్టు సమీపంలో అతి భారీ వర్షం పడింది.. వరదలు, వర్షాలపై సంసిద్ధంగా లేదనడం సరికాదని అన్నారు. పోలవరం వల్ల లక్ష ఎకరాలు మునిగిపోతాయని.. బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం, పర్ణశాల ముగినిపోవడంతో పాటు.. చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోొసార్లు నివేదికలు పంపామని వెల్లడించారు. బ్యాక్ వాటర్ నష్టం వల్ల, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని తెలిపారు.