Union Minister Kishan Reddy’s comments on TRS: జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) కింద కేంద్ర తెలంగాణకు ఎటువంటి సాయం చేయలేదని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు విపత్తుల సహయ నిధుల కింది రూ. 3000 కోట్లను కేంద్రం విడుదల చేసిందన్నారు. ఇందులో 2018 నుంచి రూ. 1500 కోట్లు విడుదల చేసిందని గణాంకాలతో సహా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, తెలంగాణకు ఎటువంటి సాయం చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మీడియాలో ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. భారత ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదని తప్పుడు ప్రచారాాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Ginna: కూతుళ్ళ గురించి మనసులో మాట చెప్పిన మంచు విష్ణు!
2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరదలు, 2022 గోదావరి వరదలు కానీ విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని.. 2020-21లో హైదరాబాద్ వరదల సమయంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి సుమారు రూ.599 కోట్లు ఇవ్వగా ఇందులో కేంద్రం వాటా కింద రూ. 449 కోట్లను రెండు విడతల్లోె రూ 224.5 కోట్ల చొప్పున విడుదల చేశామని వెల్లడించారు. 2020-21లో తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, రాష్ట్ర వాటాతో కలిపి రూ. 1500 కోట్ల అని.. ఇందులో రూ. 1200 కోట్లు భారత ప్రభుత్వ వాటా అని వెల్లడించారు. ఇదే ఏడాది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి (ఎన్డీఆర్ఎఫ్) మొత్తం రూ. 479.2 కోట్లు కేటాయిస్తే ఇందులో కేంద్రం వాటా రూ. 359.20 కోట్లని వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి మొత్తం రూ. 377.60 కోట్లు కేటాయించబడ్డాయని.. అయితే పెండింగ్ లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికేట్లు, వార్షిక నివేదికలు, ఇతరత్రా పత్రాలు సమర్పించిన తర్వాత డబ్బులను కేంద్ర విడుదల చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో హోం మంత్రిత్వ శాఖ తెలంగాణకు పూర్తి సహాయ, సహకారాలకు హామీ ఇచ్చిందని వెల్లడించారు.