Revokes Suspension of Congress MPs: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెన్షన్ కు గురైన నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో సభా వ్యవహారాలకు అడ్డుతగిలే విధంగా.. కాంగ్రెస్ ఎంపీలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్భనంపై నిరసన తెలిపారు. దీంతో ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సెషన్ మొత్తం ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్ లను సస్పెండ్ చేశారు.…
Tata motors-Mahindra sales increased in july : దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా జూలై అమ్మకాల్లో దుమ్ములేపాయి. అమ్మకాల్లో భారీగా వృద్ధిని నమోదు చేశాయి. అత్యంత సురక్షిత కార్లు, వాహనాల తయారీలో పేరుపొందిన టాటా మోటార్స్ జూలై 2022లో మొత్తం విక్రయాల్లో 51.12 శాతం అమ్మకాలను నమోదు చేసింది.
farmani naaz shiv bhajan row: శివ్ భజన్ ‘హర్ హర్ శంభు’ను ఆలపించినందుకు ఓ ముస్లిం సింగర్ ని టార్గెట్ చేశాయి పలు ముస్లిం సంఘాలు. యూట్యూబర్ ఫర్మానీ నాజ్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం హర్ హర్ శంభు పాటను ఆలపించింది. ఇటీవల ఆ గీతాన్ని విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదం అవుతోంది. పలు ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్ పై మండి పడుతున్నాయి. ఇస్లాంకు వ్యతిరేకంగా పాటను పాడావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై…
monkeypox in kerala, 20 people Quarantined: మంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవల కాలంలో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే స్పెయిన్ లో మంకీపాక్స్ వల్ల ఇద్దరు చనిపోయారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఇప్పటికే నలుగురికి మంకీపాక్స్ వ్యాధి సోకింది. కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ వ్యాధికి గురయ్యారు. ఇందులో 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ తో మరణించడం అందరిలోనూ కలవరానికి గురిచేస్తోంది.
Aditya Thackeray's key comments on Maharashtra politics: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. పత్రాచల్ భూముల వ్యవహారంలో మస్కామ్ జరిగిందని ఆరోపిస్తూ ఈడీ సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసింది. మరోవైపు కోర్టు అనుమతితో సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకోనుంది ఈడీ.
Big Relief to Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఊరట లభించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బెగుసరాయ్ న్యాయస్థానం ధోనితో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని ప్రమోటర్ గా ఉన్న ఓ ఎరువుల కంపెనీపై ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. మార్కెటింగ్ హెడ్ అజయ్ కుమార్, ఇమ్రాన్ బిన్ జాఫర్,
Attack outside a football stadium in Pak's Balochistan: పాకిస్తాన్ లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఎయిర్ పోర్టు రోడ్డులోని టర్బట్ స్టేడియంలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక పోలీస్ అధికారితో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆ పేలుడు సంభవించింది. స్టేడియంలోని పార్కింగ్ ప్రాంతంలో పార్క్…
Lashkar Terrorist Killed In Encounter In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి పెట్రేగే ప్రణాళికల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో కాశ్మీర్ లో వరసగా ఎన్కౌంటర్లో జరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ రెండు ఎన్కౌంటర్లు కూడా కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోనే చోటు చేసుకున్నాయి.
COVID 19 Updates: దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. వరసగా మూడు రోజులుగా 20 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండగా గడిచిన 24 గంటల్లో మాత్రం స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 19,673 కొత్త కరోనా కేసులు నమోదు అవ్వగా.. 39 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
Earthquake Hits Nepal: నేపాల్ మరోసారి భూకంపానికి గురైంది. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ ర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం..నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 147 కిలోమీటర్ల దూరంలోని ఖోటాంగ్ జిల్లా మార్టిమ్ బిర్టా భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఆదివారం ఉదయం 8.13 గంటలకు భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. భూకంప కేంద్రం ఉపరితనం నుంచి 10 కిలోమీటర్ లోతులో ఉంది.