Nirmala Sitharaman: ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు
- భారత ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు..
- ట్రంప్ తీరుపై పరోక్షంగా విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్..
- ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాణిజ్య ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంతో భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించాడు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతిని సాకుగా చూపించి భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిస్థితిపై ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ (IEC) 2025లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్ ఫెయిర్ గానీ, ఫ్రీ గానీ లేదు.. టారిఫ్‌లు, నాన్-టారిఫ్ అడ్డంకులు ఆర్థిక సాధనాలుగా కాకుండా వ్యూహాత్మక ఆయుధాలుగా మారిపోయాయి అని పేర్కొనింది. అయితే, భారత్ ఎప్పుడూ టారిఫ్‌లను ఆయుధాలుగా ఉపయోగించలేదు.. దేశీయ పరిశ్రమలు, ఉపాధిని కాపాడటమే మా లక్ష్యం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది.
Read Also: CM Chandrababu Naidu: ఆ విషయంలో గ్రేట్! పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు..
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
అయితే, మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్లో భారత్ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. టారిఫ్‌లు, ఇతర చర్యల ద్వారా వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ చర్చలు, రాజనీతితో ముందుకెళ్తుందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 25 శాతం భారత్ నుంచే వచ్చేది.. అలాంటి స్థాయికి మళ్లీ చేరుకోవడమే మన టార్గెట్ కావాలని అన్నారు. ప్రస్తుత సవాళ్ల మధ్య భారత్ గ్లోబల్ వాణిజ్యంలో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నమోదు చేస్తుందన్నారు. బడ్జెట్ పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కేంద్రం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోందమని నిర్మలా సీతారామన్ వెల్లడించింది.
Watch Live: Smt @nsitharaman's keynote address at the @timesnetwork #IndiaEconomicConclave in New Delhi. #IEC2025 https://t.co/ja1mZWtPYQ
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 17, 2025
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!