Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Terrorist Killed In Encounter In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి పెట్రేగే ప్రణాళికల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో కాశ్మీర్ లో వరసగా ఎన్‌కౌంటర్‌లో జరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ రెండు ఎన్‌కౌంటర్లు కూడా కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోనే చోటు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం బారాముల్లాలోని బిన్నెర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ ప్రారంభం అయింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు జాయింట్ గా ఈ ఎన్ కౌంటర్ ను నిర్వహించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఒకరు హతమయ్యాడని పోలీసులు వెల్లడించారు. భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఇది గమనించి కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. హతమైన ఉగ్రవాదిని బారాముల్లా జిల్లా పట్టాన్ కు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ గా గుర్తించారు. ఇతడు మే, 2022 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉన్నాడు. ఘటనాస్థలం నుంచి ఒక ఏకే రైఫిల్ తో పాటు 2 మ్యాగజైన్స్, స్వాధీనం చేసుకున్నారు.

Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
Read Also: CM Stalin: ఒక దేశం-ఒకే భాష నినాదంపై తమిళనాడు సీఎం సీరియస్
అంతకుముందు శనివారం ఉదయం బారాముల్లా జిల్లాలోని వనిగామ్ గ్రామంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించగా.. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో స్నిఫర్ డాగ్ ఆలెక్స్ కూడా మరణించింది. ఎన్‌కౌంటర్ జరుగుతున్న సమయంలో బాడీ కామ్ ధరించిన రెండు స్నిఫర్ డాగ్ లను లోపలికి పంపారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఒక స్నిపర్ డాగ్ మరణించింది. వనిగామ్ గ్రామంలో ఒక పాకిస్తాన్ ఉగ్రవాదితో పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, ఆర్మీ జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!