Big Relief to Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఊరట లభించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బెగుసరాయ్ న్యాయస్థానం ధోనితో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మహేంద్ర సింగ్ ధోని ప్రమోటర్ గా ఉన్న ఓ ఎరువుల కంపెనీపై ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. మార్కెటింగ్ హెడ్ అజయ్ కుమార్, ఇమ్రాన్ బిన్ జాఫర్, మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర సింగ్ ధోనీ సహా ఎనిమిది మంది వ్యక్తులు చెక్ బౌన్స్ కేసులో బుక్ అయ్యారు. అయితే తాజాగా ఈ కేసులో ధోని తరుపున న్యాయవాది గోపాల్ కుమార్ జూలై 27న వాదనలను వినిపించారు. చెక్ బౌన్స్ కేసులో ధోనికి ఎలాంటి ప్రమేయం లేదని.. ధోని కంపెనీ చైర్మన్ కానీ, బోర్డ్ డైరెక్టర్ కాదని కోర్టుకు తన వాదనలను వినిపించారు. ఈ కేసులో ఎంఎస్ ధోనికి ఎలాంటి ప్రమేయం లేదనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ధోనితో పాటు నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.
Read Also: PM Modi 91st Mann Ki Baat: ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను మీ..డీపీగా మార్చుకోండి
టీమిండియా కెప్టెన్ గా ధోని ఉన్న సమయంలో బీహార్ కు చెందిన ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి ప్రమోటర్ గా వ్యవహరించారు. ఈ సంస్థ నుంచి మరో సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. అయితే ఆ ఉత్పత్తుల్లో నాణ్యత కొరవడిందని.. కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించడంతో సదరు ఫెర్టిలైజర్ కంపెనీ ఆ ఎరువులను తిరిగి వెనక్కి తీసుకుని రూ. 30 లక్షల చెక్కులను అందించింది. అయితే ఆ చెక్కులను బ్యాంకులో వేయగా.. అది బౌన్స్ అయింది. దీంతో కంపెనీకి ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరికొంతమందికి సదరు సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఇందులో మహేంద్ర సింగ్ ధోని పేరును కూడా చేర్చారు. తాజాగా బెగుసరాయ్ కోర్టు ధోనిని నిర్దోషిగా ప్రకటించింది.