COVID 19 Updates: దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. వరసగా మూడు రోజులుగా 20 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండగా గడిచిన 24 గంటల్లో మాత్రం స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 19,673 కొత్త కరోనా కేసులు నమోదు అవ్వగా.. 39 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 19,336 మంది కరోనా బారి నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో 1,43,676 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో మహమ్మారి ప్రారంభం అయిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు మొత్తం 4,40,19,811 కేసులు నమోదు అవ్వగా.. 4,40,19,811 మంది కోలుకోగా.. 5,26,357 మరణించారు. ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల శాతం 0.33 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. డెత్ రేట్ 1.20 శాతంగా ఉంది.
Read Also: Sanjay Raut: సంజయ్ రౌత్ కు ఈడీ షాక్.. మరోసారి సోదాలు
ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 200 కోట్లను దాటింది. ఇప్పటి వరకు 204.25 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను అర్హులైన వారికి అందించారు. శనివారం ఒక్క రోజే 31,36,029 టీకాలు ఇచ్చారు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాాల్లో 58,14,58,226 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 64,18,751 మంది మరణించారు. ప్రస్తుతం జపాన్ లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శనివారం ఒకే రోజులో జపాన్ లో 2,21,938 కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు దక్షిణ కొరియాలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ 81,944 మందికి కరోనా సోకింది. ఇటలీ, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా 50 వేలకు చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి.