US President Joe Biden tests Covid-19 positive: యూఎస్ఏ ప్రెసిడెంట్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు బైడెన్. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడ్డ బైడెన్ మరోసారి ఇటీవల కరోనాకు గురయ్యారు. ఇప్పటికే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రికాషనరీ, బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. అయినా కూడా ఇటీవల మళ్లీ కరోనా బారినపడ్డారు.
Chinese rocket reenters atmosphere over Indian Ocean: ప్రపంచాన్ని కలవరపెడుతున్న చైనా రాకెట్ ఎలాంటి నియంత్రణ లేకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు యూఎస్ఏ ధ్రువీకరించింది. తూర్పు కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు చైనా రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు యూఎస్ స్పెస్ కమాండ్ శనివారం వెల్లడించింది.
commonwealth games-India vs Pakistan T20match: కామన్వెల్త్ గేమ్స్ లో కీలక పోరు జరగనుంది. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి. దీంతో ఈ సారి సత్తా చాటాలని భారత అమ్మాయిలు భావిస్తున్నారు. ఫస్ట్ మ్యాచులో ఆఖరి వరకు పోరాడినా.. ఆస్ట్రేలియా మ్యాచులో విజయం దక్కలేదు. తాజాగా ఆదివారం రోజు మ
Commonwealth Games Bindyarani Devi Wins Silver: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ మూడు పతకాలను కైవసం చేసుకోగా.. మరో పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా...
Commonwealth games meera bai chanu won the gold medal: కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు పతకాలను గెలుచుకోగా.. తాజాగా మరో పతకాన్ని ఇండియా కైవసం చేసుకుంది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఏకంగా స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను కైవసం చేసుకుంది.
Sri Lankan crisis- women into prostitution: శ్రీలంకలో రాజకీయ అధికారం మారినా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనం అయిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం పెద్దపెద్ద క్యూల్లో నిలబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది.
Liz Truss leads with 90 pc chance in race for next UK PM: యూకే ప్రధాని రేసులో రిషి సునక్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ముందు నుంచి ప్రధాని రేసులో ముందువరసలో ఉన్న రిషి సునక్ కీలకమైన పోటీని ఎదుర్కొంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు గెలుచుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల ఓట్లను సంపాదించాల్సి ఉంది.
PM Narendra Modi-All India District Legal Service Authorities meet: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో..ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీటింగ్ తొలి కార్యక్రమంలో అన్నారు. ఏ సమాజానికైనా న్యాయవ్యవస్థ అవసరం.. అదే విదంగా న్యాయం అందించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు.
AAP government Withdrawal of new liquor policy: ఢిల్లీలో ఆప్ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త మద్యంపాలసీని ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. మద్యం షాపులపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడంతో ఢిల్లీ ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.
Spain registers first monkeypox death: మంకీపాక్స్ కేసులు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి. ఇప్పటికే 78 దేశాల్లో 18 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరోపియన్ దేశాల్లోనే వీటి తీవ్రత అధికంగా ఉంది. బ్రిటన్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరోపియన్ దేశాల్లో కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..