Attack outside a football stadium in Pak’s Balochistan: పాకిస్తాన్ లో మరోసారి బాంబ్ దాడితో దద్దరిల్లింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఎయిర్ పోర్టు రోడ్డులోని టర్బట్ స్టేడియంలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక పోలీస్ అధికారితో పాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆ పేలుడు సంభవించింది. స్టేడియంలోని పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన ఓ మోటార్ సైకిల్ లో పేలుడు పదార్ధాలను అమర్చి.. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబును పేల్చేశారు. స్టేడియానికి రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో టర్బట్ జిల్లా క్రీడాధికారితో పాటు పోలీసులు మంజూర్ అహ్మద్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఫుట్ బాల్ మ్యాచును ఫ్రాంటియర్ కార్ప్స్ సౌత్ నిర్వహించింది. ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొన్న ఆలగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్.. లష్కర్ ఉగ్రవాది హతం
కాగా.. బెలూచిస్తాన్ లో గత కొంత కాలంగా బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ వరసగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ నుంచి బెలుచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తోంది. ఇటీవల బెలూచ్ విముక్తికి భారత దేశం సహకరించాలని బెలూచ్ పోరాట యోధులు కోరారు. ఇదే కాకుండా ఇటీవల పాకిస్తాన్ – చైనా ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టుతో బెలూచిస్తాన్ లో భారీగా సైన్యం మోహరించింది. దీంతో పాటు చైనీయుల సంఖ్య అక్కడ ఎక్కువగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వరసగా చైనా జాతీయులు, పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పాక్ సైన్యం బెలూచ్ ప్రజలపై అకృత్యాలకు పాల్పడుతుందని బెలూచ్ లిబరేషన్ ఫోర్స్ ఆరోపిస్తోంది. బెలూచిస్తాన్ లో ప్రజల హక్కులకు విలువ లేకుండా పోయింది. దీంతోనే వరసగా ఇటీవల కాలంలో కరాచీలో బాంబు దాడులకు పాల్పడింది. బెలూచిస్తాన్ లో సైన్యాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తోంది.