National herald case - ED seals Young Indian's office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది.
Command and Control Centre inauguration-Traffic advisory issued: హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానుంది. రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. పలువురు వీఐపీలు హాజరవుతుండటంతో భద్రతా పరమైన ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. సేఫ్ సిటీ…
National Commission for Scheduled Tribes Comments on Adilabad Collector Sikta Patnaik: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా పరిధిలోని యాపల్ గూడ, రాంపూర్ గ్రామాల్లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల కేసులు విచారణలో భాగంగా కలెక్టర్ ను ప్రశ్నించింది. ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టీల భూములను సేకరిస్తుంటే ఏం చేశారని.. కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 107 ఎకరాల భూమిని
Nancy Pelosi Taiwan Visit: అమెరికా ప్రతినిధుల సభ్య స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన అమెరికా, చైనాల మధ్య అగ్గిరాజేసింది. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిప్పులో చెలగాటమాడుతున్నారని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండా బుధవారం నాన్సీ పెలోసీ తైవాన్ ను సందర్శించారు. ఇదిలా ఉంటే ఆమె పర్యటనపై రష్యా స్పందించింది. పెలోసీ పర్యటన ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని.
IIIT Basar Students To Discuss Problems With Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలొో నెలకొన్న సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. వరసగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేెకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన…
Addanki Dayakar comments on BJP, Komati Reddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాకపుట్టిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మంగళవారం తన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక త్వరలోనే మునుగోడుకు ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు కోమటి రెడ్డి వ్యవహారంపై ఫైర్ అవుతున్నారు. ఇటు బీజేపీతో పాటు అటు కోమటి రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Tummala Nageswara Rao sensational comments on the election: తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీకి ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరడం దాదాపుగా ఖాయం అయింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో
Anjan Kumar Yadav Comments on BJP, Rajgopal Reddy: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తరువాత కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ బీజేపీపై, కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు, బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్మాష్ మాటలు మాట్లాడటం…
Raghunandan Rao comments on Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కాకరేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కలరవపెట్టింది. దీంతో పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డిపై ఎదురుదాడి ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు
UK PM Race - Rishi sunak: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు, కన్జర్వేటివ్ పార్టీకి అధ్యక్ష పదవికి సంబంధించి భారత సంతతి వ్యక్తి రిషి సునక్, మరో అభ్యర్థి లిజ్ ట్రస్ కు మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల కొన్ని సర్వేల్లో ప్రధాని పదవిలో లిస్ ట్రస్ ముందున్నారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇటలీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కంపెనీ టెక్నీ నిర్వహించిన ఓ సర్వేలో రిషి సునక్ పుంజుకున్నట్లు వెల్లడించింది. వీరిద్దరి మధ్య తేడా కేవలం 5 శాతం…