Venu Goapl Reddy
Author- NTV Telugu-
Missile Misfire: ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం..
Missile Misfire: రాజస్థాన్ జైసల్మేర్ లోని పోఖ్రాన్ వద్ద ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. ఆర్మీ యూనిట్ ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. భారత ఆర్మీ చెబుతున్నదాని ప్రకారం క్షిపణి విమానంలో పేలింది. పోఖ్రాన్ రేంజ్ లో ఈ ఘటన జరిగింది. క్షిపణి విమానంలో ఉండగా పేలింది. శిథిలాలు పక్కన ఉన్న పొలాల్లో పడిపోయాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది. దీనిపై విచారణ ప్రారంభించారు. -
Rahul Gandhi: గాంధీ సిద్ధాంతాలకు ద్రోహం.. రాహుల్ గాంధీ శిక్షపై ఇండో-అమెరికన్ పొలిటీషియన్..
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై పలువురు విదేశీ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు భారత-అమెరికా సంతతి నేత రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని, ఇది భారతీయ విలువలకు తీవ్రమైన ద్రోహం అని ట్వీట్ చేశాడు. రోఖన్నా యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ లో సిలికాన్ వ్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
Earthquake: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వరస భూకంపాలు..
Earthquake: దేశంలో ఇటీవల కాలంలో పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లోని భట్గావ్ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. -
Canada: మహత్మాగాంధీ విగ్రహం ధ్వంసం.. ప్రధానిపై విద్వేష రాతలు.. ఖలిస్తానీవాదుల అరాచకం
Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది. -
Amritpal Singh: డెహ్రాడూన్, హరిద్వార్ హై అలర్ట్.. నేపాల్‌కు పారిపోయేందుకు ప్లాన్..
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. గత ఏడు రోజులుగా అతను తప్పించుకు తిరుగుతున్నాడు. హర్యానాలో ఆయనకు ఓ మహిళా ఆశ్రయం ఇచ్చిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడితో పాటు అతడి సన్నిహితుడు పప్పల్ ప్రీత్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చిన మహిళను అరెస్ట్ చేశారు. తలపాగా తీసేసి తన రూపాన్ని మార్చుకుని, గొడుగు చాటున వెళ్తున్న ఫోటో ప్రస్తుతం పోలీసులకు చిక్కింది. -
Supreme Court: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై సుప్రీంకోర్టుకు 14 ప్రతిపక్ష పార్టీలు..
Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
Delhi Riots Case: ఢిల్లీ అల్లర్లలో ఆప్ కీలక నేతపై మర్డర్ కేసు..
Delhi Riots Case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఖజూరి ఖాస్ డ్రెయినేజ్ కాలువ నుంచి అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ హత్య సంచలనంగా మారింది. అంకిత్ శర్మ హత్యకు సంబంధించి ఆమ్ ఆద్మీ నేత తాహిర్ హుస్సెన్, మరో 10 మందిపై ఢిల్లీ కోర్టు గురువారం కిడ్నాప్, మర్డర్ అభియోగాలను మోపింది. అధికారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు… -
Women Pilots: ఆకాశంలో ఆమె.. భారత పైలెట్లలో 15 శాతం మహిళలే.. గ్లోబల్ యావరేజ్‌ని మించి..
Women Pilots: భారతదేశంలో మొత్తం పైలెట్లలో 15 శాతం మహిళలే ఉన్నారు. ప్రపంచ సగటు కన్నా ఇది ఎక్కువ. ప్రపంచంలో మహిళా పైలెట్ల సగటు 5 శాతం మాత్రమే ఉంది. భారత దేశంలో మహిళా పైలెట్లు దీనికి మూడు రెట్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఎయిర్ ఆపరేటర్లలో 67 మంది విదేశీ పైలెట్లు పనిచేస్తున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. -
Viral Video: టేకాఫ్ అయిన వెంటనే ఆగిన ఇంజన్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..
Viral Video: జార్ఖండ్ లో ఓ చిన్న విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజన్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆన్ బోర్డ్ కెమెరా ఫ్లైట్ ప్రమాద దృశ్యాలను చిత్రీకరించింది. చివరకు ఓ ఇంటిలోకి గ్లైడర్ దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో పైలెట్, ప్యాసింజర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
Congress: నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. రాహుల్ గాంధీపైనే చర్చ
Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!