Gun firing At Canberra Airport: ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియాలో తుపాకీ కాల్పలు కలకలం రేపాయి. ఆదివారం దేశ రాజధాని కాన్‌బెర్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రయాణికుల చెక్ ఇన్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల శబ్ధం విన్న ఎయిర్ పోర్టు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. దుండగుడు మొత్తం తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే సిబ్బందికి, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.
Read Also: Vijay Devarakonda Liger: అనన్య, విజయ్ దేవరకొండ హాట్ ప్రమోషన్.. క్యాప్షన్ ఇచ్చిన హీరోయిన్
కాల్పులతో విమానాశ్రయాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల వెనకఉన్న ఉద్దేశ్యాన్ని కనుక్కునేందుకు నిందితుడిని విచారిస్తున్నారు. ఒక్క వ్యక్తే కాల్పులకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు పాల్పడిన వ్యక్తి ముందుగా టెర్మినల్ ప్రాంతంలో కూర్చుని ఉన్నాడని.. ఓ ఐదు నిమిషాల తర్వాత లేచి జేబులో ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారని.. సీసీ కెమెరాల్లో స్పష్టంగా తెలుస్తోంది. తుపాకీ కాల్పుల వల్ల సమీపంలో ఉన్న గ్లాసెస్ పగిలిపోవడంతో పాటు గోడలకు రంధ్రాలు పడ్డాయి. గన్ ఫైరింగ్ వినగానే ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు.
ఘటన జరిగిన తర్వాత ఎయిర్ పోర్టు మొత్తాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికులను రావద్దని సూచించారు. ఘటన జరిగిన వెంటనే అన్ని ఫ్లైట్స్ ను నిలిపివేశారు. సాధ్యమైనంత త్వరగా విమానాలను యథావిధిగా ఆపరేట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.