How to dispose damaged Indian national flag with dignity: భారత దేశం బ్రిటీష్ వారి వలస పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ సారి స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను దేశం మొత్తం ఘనంగా నిర్వహించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్రానికి గుర్తుగా ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి గర్వంతో ఉప్పొంగిపోతున్నాము. సోషల్ మీడియాలో జాతీయ జెండాతో డీపీలు, సెల్ఫీలు దిగి గర్వంతో మురిసిపోతున్నాము. అయితే ఇదంతా బాగుంది కానీ.. అసలు జాతీయ జెండాను ఎలా గౌరవించాలనే విషయాలు మాత్రం మరిచిపోతున్నాము. ఆగస్టు 15 ముగిసిన తర్వాత జాతీయ జెండాకు జరుగుతున్న అవమానాల గురించి చాలా సార్లు మనం వింటూనే ఉన్నాము. రోడ్డు పక్కన, చెత్త కుప్పల్లో జాతీయ జెండాను పడేయడం మనకు కనిపిస్తుంటాయి. ఆగస్టు 15 ముందు వరకు ఉన్న గౌరవం ఒక్కసారిగా తొలిగిపోవడం చూస్తుంటాం.
అయితే జాతీయ జెండాను అగౌరవపరచడం నేరం అని మనలో ఎంత మందికి తెలుసు..? ముఖ్యంగా వేడుకలు ముగిసిన తర్వాత చిరిగిన, దెబ్బతిన్న జాతీయ పతాకాన్ని ఎంత గౌరవంగా పారేయాలనేది చాలా మందికి తెలియదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2022లో పేర్కొన్న నిబంధనల ప్రకారం దెబ్బతిన్న జాతీయ పతకాన్ని రెండు పద్దతుల ద్వారా గౌరవంగా పారేయాలి. దహనం చేయడం లేదా పాతి పెట్టడం ద్వారా గౌరవంగా పారేయాలి.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్చ.. గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి
ఈ రెండు పద్ధతుల్లో జాతీయ జెండాను పారవేసే సమయంలో కూడా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. జెండాను పాతిపెట్టడానికి ముందు జాతీయ జెండాను ఓ చెక్క పెట్టలో సేకరించాలి. జెండాను మడతపెట్టి పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టాలి. జెండాను పాతిపెట్టిన తర్వాత ఒక క్షణం పాటు మౌనం పాటించాలి.ఇక రెండో పద్ధతిలో దహనం చేసే సమయంలో కూడా కఠిన నిబంధనలు పాటించాలి. జెండాను అగ్నిలో కాల్చివేసే సమయంలో.. ఆ చోటును శుభ్రం చేయాలి. అగ్నిని ముందుగా ఏర్పాటు చేసి మంటల మధ్య జెండాను జాగ్రత్తగా మంటల మధ్య ఉంచి కాల్చాలి. జెండాను మడతపెట్టకుండా.. ముందుగా అగ్నిని నిర్మించకుండా కాల్చిడం, జెండాకు ముందుగా నిప్పు పెట్టడం నేరాలుగా భావించాల్సి ఉంటుంది. జాతీయ జెండా మన దేశాని గర్వకారణం..దానిని పారేసేటప్పుడు కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.
ప్లాస్టిక్‌తో తయారు చేసిన భారత జాతీయ జెండాను ఉపయోగించకుండా ఉండాలని ప్రతి ఒక్కరినీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది మరియు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫ్లాగ్ కోడ్‌ను ఖచ్చితంగా పాటించాలని కోరింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం, భారత జాతీయ జెండాను పారవేసే నియమాలను అనుసరించడం ద్వారా భారతదేశ జాతీయ జెండా గౌరవించాలి.