Corona Cases In India: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,092 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ మహమ్మారి బారిన పడి ఒక రోజులో 41 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,16,861 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేస్ లోడ్ శాతం 0.26గా ఉంది. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. డైలీ పాజివిటీ రేటు 4.36గా ఉంది.
Read Also: JK Rowling: హ్యరీపోటర్ రచయిత్రి జేకే రౌలింగ్ కు హత్యా బెదిరింపు.. రష్దీ తరువాత నువ్వే అంటూ..
దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి 5,27,037 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులో ఈ మరణాల శాతం 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కరోెనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 4,36,09,566గా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 207.99 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులును వేశారు. శనివారం 28,01,457 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. శనివారం 3,81,861 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 59,45,50,623 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 64,53,327 మంది మరణించారు. జపాన్, దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.