టీనేజ్ లోనే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ షార్ట్ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనశ్వర ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది.
Also Read : Pawan Kalyan : OG డైరెక్టర్ సుజిత్ కు పవర్ స్టార్ ఖరీదైన గిఫ్ట్
అనశ్వర రాజన్ టాలీవుడ్ లో అచ్చమైన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఛాంపియన్ సినిమాలో చంద్రకళ అనే క్యారెక్టర్‌తో పరిచయం అవుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనశ్వర పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్ ముందు అనశ్వరకు ఇదే అసలైన పరీక్ష. ఇటీవల మాలీవుడ్‌లో బిజీగా ఉండటంతో కోలీవుడ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన అనశ్వర ఇప్పుడు మళ్లీ తమిళ ఇండస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయడం లేదు. డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కుతున్న విత్ లవ్ లో అనశ్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. అలాగే 7/G రెయిన్‌బో కాలనీ 2లోనూ నటిస్తోంది. దీన్ని తెలుగులో 7/G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్‌గా అనశ్వర మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఇట్లు అర్జునలో అనశ్వర హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా ఒకేసారి మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్… వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తు స్టార్ హీరోయిన్ సరసన చేరేందుకు ప్రయత్నిస్తోంది అనశ్వర రాజన్.