బలమైన గాలుల దెబ్బకు కూలిన ‘Statue Of Liberty’ ప్రతిరూపం.. వీడియో వైరల్
- బ్రెజిల్ దక్షిణ ప్రాంతంలో తీవ్ర తుఫాన్
- గువైబా నగరం అతలాకుతలం హావన్ మెగాస్టోర్ లో ఉన్న 24 మీటర్ల స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం
- గంటకు 90 కిలోమీటర్లకు మించి గాలి వేగంకు కూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం
- విగ్రహం నెమ్మదిగా ఒరిగి ఖాళీ పార్కింగ్ స్థలంపై పడిన దృశ్యాలు వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Statue Of Liberty: బ్రెజిల్ దక్షిణ భాగంలో సోమవారం (డిసెంబర్ 15) తీవ్ర తుఫాన్ గువైబా నగరాన్ని అతలాకుతలం చేసింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గువైబాలో, హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. భారీ విగ్రహం నెమ్మదిగా ముందుకు ఒరిగి ఖాళీ పార్కింగ్ స్థలంపై పడిపోతున్న దృశ్యాలు అందరినీ భయపెట్టేలా చేశాయి.
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ డిఫెసా సివిల్ (Defesa Civil) తెలిపిన వివరాల ప్రకారం.. తుఫాన్ సమయంలో గాలి వేగం గంటకు 90 కిలోమీటర్లకు మించి నమోదైందని పేర్కొన్నారు. గువైబా మెట్రోపాలిటన్ ప్రాంతమంతా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. 2020లో ఇంజినీర్ల సర్టిఫికేషన్‌తో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం 11 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ బేస్‌పై అమర్చబడింది. అయితే, విగ్రహం కూలినా బేస్ మాత్రం ఎలాంటి నష్టం లేకుండా నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. విగ్రహం కూలిపోవడానికి క్షణాల ముందే అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై పార్కింగ్‌లో ఉన్న వాహనాలను తొలగించడంతో ప్రమాదం తప్పింది. హావన్ సంస్థ కూడా వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసి, భద్రతా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. కొన్ని గంటల్లోనే శిథిలాలను తొలగించగా, స్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించింది.
Tollywood : కెరీర్ ను టర్న్ చేసే సినిమా కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా ఈ తుఫాన్ ప్రభావానికి లోనయ్యాయి. టియో హ్యూగోలో వడగళ్ల వాన కురవగా.. పాసో ఫుందో, సాంటా క్రూజ్ డో సుల్, వేరా క్రూజ్ ప్రాంతాల్లో పైకప్పులు దెబ్బతిన్నాయి. లాజియాడోలో భారీ వర్షాల కారణంగా స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదని, 2021లో కపావో దా కానోయాలో గంటకు 70–80 కిలోమీటర్ల వేగంతో వీచిన సైక్లోన్ సమయంలో మరో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయిందని హావన్ గుర్తు చేసింది. అప్పట్లో కూడా కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. తాజా ఘటన అనంతరం ఇంజినీరింగ్ బృందాలు సాంకేతిక పరిశీలనలు ప్రారంభించాయి.
BREAKING: Statue of Liberty collapses due to strong winds in Guaíba, Brazil.
PS: The replica statue was installed in the early 1900s and is associated with Freemasonry. pic.twitter.com/dA3NfVWnSx
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 15, 2025
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!