Asaduddin owaisi comments on bjp, pm modi about kashmiri pandit assassination: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేశారు. మంగళవారం రోజూ సునీల్ కుమార్ భట్ అనే పండిట్ ను కాల్చిచంపారు. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణం అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాపై విరుచుకుపడ్డారు అసదుద్దీన్. కాశ్మీర్ పండిట్ హత్య నరేంద్రమోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణ అని అన్నారు. కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైందని.. ఇప్పుడు కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ లోయను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగింపు నుంచి కాశ్మీరీ పండిట్లకకు కేంద్రం సహయం చేయలేదని.. వారిపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదని.. భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. పండిట్ల హత్యలకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Read Also: Karthikeya 2: ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నా… అందులో నా స్వార్థం ఉంది: అల్లు అరవింద్
కాశ్మీరి పండిట్లపై జరిగిన దాడి మాటల్లో చెప్పలేనంతగా బాధ కలిగించింది.. బాధితకుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. కాశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలు నేటికి కొనసాగడం సిగ్గు చేటని..వాళ్లు తమ వాళ్లనే చంపేస్తున్నారని.. భారతదేశానికి అండగా నిలిచే ప్రతీ ఒక్కరినీ చంపేస్తున్నారని.. గత 30 ఏళ్లుగా ఇది కొనిసాగుతోందని.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.
బీజేపీ అధికార ప్రతినిధి అల్తాప్ ఠాకూర్ మాట్లాడుతూ.. షోఫియాన్ వద్ద అమాయక మైనారిటీ కమ్యూనిటీ సభ్యులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు.. ఉగ్రవాదానికి మతం లేదని.. హంతకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా కాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి. ఆదివారం నౌహట్టాలోని ఉగ్రవాద దాడుల్లో ఓ పోలీస్, బండిపొరాలో ఒక వలస కూలీ మరణించారు. బుద్గాం, శ్రీనగర్ జిల్లాల్లో సోమవారం రెండు గ్రెనేడ్ దాడులు జరిగాయి.