The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ - ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు చేరువయ్యారు. 2000 ప్రారంభంలో…
Corona Cases In India: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా 9,436 కేసులు నమోదు అయ్యాయి. శనివారం నమోదైన కేసుల కన్నా 820 కేసులు తగ్గాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలకు దిగువకు వచ్చింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 86,591కు…
Pakistan floods death toll crosses 1,000, rainfall continues: దాయాది దేశం పాకిస్తాన్ వరదలతో వణుకుతోంది. భారీ వర్షాలు, వరదలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ దేశం.. వరదల కారణంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు పంజాబ్, గిల్గిత్ బాల్టిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో కూడా వరద ప్రభావం ఉంది. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ వరదల…
Sonia Gandhi to hold CWC meet today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. అయితే అధ్యక్షుడిగా పదవిని స్వీకరించడానికి రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
Perseverance Rover Discovers Rocks Shaped By Water On Mars: సౌరమండలంలో భూమి తరువాత నివాసయోగ్యంగా ఉండే గ్రహం ఏదైనా ఉందంటే అది అంగారకుడే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మార్స్ పై కాలనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది స్పెస్ ఎక్స్ వంటి అంతరిక్ష సంస్థ. ఇప్పటికీ అంగారకుడి ధృవాల వద్ద మంచురూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు నీటితో నిండి ఉన్న అరుణ గ్రహంపై పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు ఆర్బిటర్లను పంపించాయి.…
JEE Advanced 2022 Exam: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ రోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్సుడ్ పరీక్ష జరగనుంది. దీంతో అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అయ్యారు. ఆరు గంటల నిడివి కలిగిన ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్టు ఆగస్టు 28 ఉదయం 9 నుంచి ప్రారంభం అయి 12.00 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై 5.30 వరకు జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి…
Hungarian national rescued by Indian Army: ఇండియన్ ఆర్మీ హిమాలయాల్లో తప్పిపోయిన హంగేరియన్ పౌరుడిని రక్షించింది. సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తరువాత తప్పిపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన హంగేరియన్ జాతీయుడు దారి తప్పిపోయాడు అతని కోసం ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గడ్డకట్టుకుపోయే పరిస్థితులు.. క్షణక్షణం మారే వాతావరణ పరిస్థితుల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
Tractor Carrying 24 Falls Into UP River: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హర్డోయి లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ హర్దోయ్ లోని గర్రా నదిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తిని ముఖేష్ గా గుర్తించామని…
Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడలా కూల్చివేతకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 నిమిషాల వ్యవధిలోనే కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 28న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.…
Taliban refuses female students to leave Kabul for studies: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ప్రారంభం అయి ఏడాది గడిచింది. 2021 ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి స్త్రీలపై వివక్ష చూపిస్తున్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు. స్త్రీ విద్యను వ్యతిరేకిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా కుటుంబంలోని మగవాళ్ల తోడు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. షరియా చట్టాన్ని అమలు చేయడానికే తాలిబన్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.