Venu Goapl Reddy
Author- NTV Telugu-
Emergency at Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ.. పక్షిని ఢీకొట్టిన ఫెడ్ ఎక్స్ విమానం..
Emergency at Delhi airport: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఫెడ్ ఎక్స్ విమానం పక్షి దాడికి గురైంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శనివారం ఈ ఘటన జరిగింది. విమానం 1000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే పక్షిని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 10.46 గంటలకు టేకాప్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరారు. దీంతో విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అన్ని టెక్నికల్… -
Google: ఉద్యోగులకు ఫ్రీ స్నాక్స్, లంచ్ కట్.. పొదుపులో భాగంగా గూగుల్ నిర్ణయం..
Google: ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి. -
Summer Season: దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న ఎండలు.. సాధారణం కన్నా అధికం.. ఐఎండీ హెచ్చరిక
India To Witness Above-Normal Temperatures From April To June: మార్చి చివర నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎండాకాలంపై కీలక సమాచారాన్ని తెలిపింది. ఈ సారి ఎండాకాలం మండేకాలంగా ఉండబోతోందని వెల్లడించింది. భారత్ చాలా ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉండనున్నట్లు తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాననున్నట్లు… -
Bank Loan Fraud: ఎస్బీఐకి రూ.95 కోట్ల టోకరా.. నిందితుడి అరెస్ట్..
Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ నుంచి రూ.95 కోట్ల రుణం పొందాడు.… -
Heart Health: రన్నింగ్ చేయడం కన్నా వాకింగ్ చేయడం గుండెకు మంచిది..
Walking is better than running: వ్యాయామంలో భాగంగా నడవడం, పరిగెత్తడం గుండె వ్యాధులను తగ్గిస్తాయి. రన్నింగ్, వాకింగ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. ఇలాంటి వ్యాయామాలు ఊపిరిని గట్టిగా పీల్చుకునేలా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా శరీర భాగాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ క్రమంలో ధమనుల్లో ఉన్న అవాంతరాలను తొలగిపోతాయి. కార్డియో వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో షుగర్ అదుపులో ఉంటుంది, మెరుగైన మెరుగైన జ్ఞాపకశక్తి, ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
Mohan Bhagwat: భారత్ నుంచి ఎందుకు విడిపోయామా అని పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారు.
Mohan Bhagwat: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గుడుస్తున్నా.. పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. భారత్ తో ఎందుకు విడిపోయామా అని అనుకుంటున్నారని, భారత్ విభజన పొరపాటుగా భావిస్తున్నారని అన్నారు. శుక్రవారం సింధీ యువవిప్లవకారుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు సంతోషంగా ఉందా..? అని ప్రశ్నించారు. అక్కడ ప్రజలు బాధ అనుభవిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం… -
Stormy Daniels: ట్రంప్‌ను ఇరికించిన శృంగార తార స్టార్మీ డేనియల్స్.. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు..
Stormy Daniels: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ల తరుపున పోటీ చేద్ధాం అని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఓ శృంగార తార చేసిన ఆరోపణలు ఆయన్ను జైలు పాలయ్యేలా చేస్తున్నాయి. ఈ పోర్న్ స్టార్ పేరే స్టార్మీ డేనియల్స్. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ట్రంప్ తో శృంగారం గురించి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు 1,30,000 డాలర్లను అందించినట్లు స్టార్మీ డేనియల్స్ ప్రకటించడం అమెరికాను ఓ కుదుపుకుదిపేసింది. ప్రస్తుతం మాన్ హట్టన్ అటార్నీ ట్రంప్… -
Solar Flare: భూమిని ఢీ కొట్టిన సౌరజ్వాల.. పలు ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ కు అంతరాయం.. సూర్యుడిపై మార్పులకు కారణం ఇదే..
Powerful flare from Sun hits Earth: సూర్యుడి నుంచి వెలువడిన శక్తివంతమైన సౌరజ్వాల భూమిని మార్చి 29న ఢీకొట్టింది. శక్తివంతమైన ఆవేశపూరిత కణాలు కలిగిన ఈ సౌరజ్వాల భూ వాతావరణంలోని పై పొరను అయనీకరించింది. దీనివల్ల ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో షార్ట్ వేవ్ రేడియో బ్లాక్ అవుట్ కు దారి తీసింది. సూర్యుడిపై ఉన్న సన్‌స్పాట్ AR3256 నుంచి ఈ సౌరజ్వాల వెలువడింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఇలా సౌర జ్వాలలు భూమివైపు దూసుకువస్తుంటాయి. -
Uttar Pradesh: గన్ తో బెదిరించి మహిళా సిబ్బందిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే మాల్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్ని అత్యాచారానికి సహకరించారు. సెక్యూరిటీ గార్డు బలవంతం చేస్తుంటే సూపర్ వైజర్, హౌస్… -
Killer Plant Fungus: కోల్‌కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు
Killer Plant Fungus: ప్రపంచంలో అత్యంత అరుదుగా మొక్కల్లో సోకే ఫంగస్ మనుషులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిలో కనుక్కున్నారు. మొక్కలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తి మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే ప్లాంట్ మైకాలజిస్ట్. మొక్కల శిలీంధ్రాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే సదరు వ్యక్తికి శిలీంద్రం ఇన్ఫెక్షన్ సోకింది.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!