Party Funds: గుర్తు తెలియని మూలల నుంచి వచ్చే విరాళాల్లో ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ సీపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన గుప్త నిధుల్లో ప్రాంతీయ పార్టీల్లో వైసీసీ మొదటిస్థానంలో ఉంది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య అన్ని జాతీయ పార్టీలకు కలిపి రూ. 15,077 కోట్ల గుప్త నిధులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. 2020-21లో ఈ పార్టీలన్నింటికీ…
U.S. suspends 26 Chinese flights in response to China flight cancellations: చైనా, అమెరికాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం అయింది. చైనా ఎంత ఆక్షేపించినా కూడా అమెరికన్ ప్రతినిధులు తైవాన్ లో పర్యటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే నెల రోజుల్లో నలుగురు అమెరికన్ రాజకీయ నాయకులు తైవాన్ లో పర్యటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇరు దేశాలు…
Pakistan Declares National Emergency: అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.. మరోవైపు శ్రీలంక పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది దాయాది దేశానికి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల మధ్య ఆ దేశాన్ని వరదలు, భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. వరదల వల్ల ఏకంగా 937 మందికి పైగా మరణించారు. 3 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘జాతీయ అత్యవసర పరిస్థితి’’ని ప్రకటించింది.
Supreme court on Freebies Case: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు.. రాజకీయ పార్టీల ఉచితాలపై కీలక తీర్పు వెల్లడించారు. ఎన్వీ రమణ పదవీ విరమణ చివరి రోజు సందర్భంగా సుప్రీంకోర్టు వాదనల్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిన రాజకీయ పార్టీ ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది
Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని
Congress leader Ghulam Nabi Azad resigns Congress Party: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. పార్టీ తీరుపై గత కొంత కాలంగా ఆజాద్ అసంతృప్తిగా ఉంటున్నారు. ఇటీవల కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
Fire accident in Uttar pradesh: పెళ్లింట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేదికలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ముందుగా ఓ పెళ్లి వేదికలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత అవి మూడొంతస్తుల భవనానికి వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న ఐదుగురు మరణించారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. చనిపోయిన వారంత ఒకే కుటుంబానికి చెందినవారే.
Assam Police arrests over 34 people with Al-Qaeda links: అస్సాం రాష్ట్రంలో టెర్రర్ లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అస్సాంలోని పలు జిల్లాల్లో ఇమామ్ లుగా పనిచేస్తున్న వారితో పాటు మదరసా కేంద్రంగా ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న వారిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్ ఖైదా అనుబంధంగా ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థ తరుపున పని చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా అస్సాంలో గురువారం మరికొన్ని అరెస్టులు జరిగాయి. అల్ ఖైదాతో సంబంధం ఉన్న 34…
covid cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గతంలో కన్నా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లే చెప్పవచ్చు. వారం రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అయ్యేది. అయితే ప్రస్తుతం మాత్రం రోజూవారీ కోవిడ్ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి.
Rishi Sunak and wife perform ‘gau pooja’ in London, video goes viral: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్.. హిందూ ఆచారాలను పాటిస్తారని అందరికీ తెలుసు. కుటుంబ సమేతంగా హిందూ పండగలను జరుపుకుంటారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ ఏం చేసినా.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా రిషిసునక్, అతని భార్య అక్షతా మూర్తి కలిసి ‘గో పూజ’లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బ్రిటన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రిషి…