Venu Goapl Reddy
Author- NTV Telugu-
Donald Trump: ట్రంప్ అరెస్ట్, విడుదల.. అమెరికాను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం..
Donald Trump: అమెరికాలో ఎప్పుడూ జరగని విధంగా ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హుష్ మనీ కేసులో పోలీసులు ట్రంపును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం న్యూయార్క్ లో ని మాన్ హటన్ లోని కోర్టులో హాజరయ్యారు ట్రంప్. ఆయనపై మొత్తం 34 అభియోగాలను నమోదు అయ్యాయి. అయితే తాను దోషిని కానని ట్రంప్ కోర్టు ముందు తెలిపారు. -
Home Theatre Explodes: హోం థియేటర్ పేలుడు.. పెళ్లి కొడుకుతో పాటు మరొకరి మృతి..
Home Theatre Explodes: పెళ్లిలో పెట్టిన గిఫ్టులు ఆశగా ఓపెన్ చేస్తే అది కాస్త పేలి పెళ్లి కొడుకుతో పాటు మరొకరు మరణించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న వ్యక్తి హోం థియేటర్ మ్యూజిక్ సిస్టమ్ గిప్టుగా వచ్చింది. పెళ్లయిన వ్యక్తి, అతడి అన్నయ్య హోం థియేటర్ ఓపెన్ చేసి వైర్‌ను ఎలక్ట్రిక్ బోర్డ్‌కు కనెక్ట్ చేసిన తర్వాత హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఆన్ చేయగా, భారీ పేలుడు సంభవించింది. -
Jharkhand: ఓర్నాయనో .. 12వ భార్యను చంపేశాడు… 11 మంది విడిచిపోయారు
Man beats 12th wife to death in jharkhand: జార్ఖండ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఇక్కడ విషయం ఏమిటంటే మరణించిన మహిళ, నిందితుడికి 12వ భార్య. వివారాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్ దార్ పంచాయతీలోని తారాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
RSS: ఆర్ఎస్ఎస్ నేతలకు ఉగ్రవాద సంస్థ బెదిరింపులు.. హిట్ లిస్ట్ విడుదల..
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ పాల్పడుతూ.. హైబ్రీడ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. కాశ్మీర్ విముక్తి కోసం అంటూ లష్కర్ తరపున పనిచేస్తోంది. గతంలో చాలా సార్లు నాన్ లోకల్స్, వలస కూలీలు, హిందువులు, భారతదేశానికి మద్దతు తెలిపే ముస్లింలపై దాడులకు తెగబడింది. -
Parole to marry girlfriend: హత్య కేసులో నిందితుడు.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు పెరోల్..
Parole to marry girlfriend:ఇటీవల అత్యాచార కేసులో నిందితుడైన యువకుడికి బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఓ కోర్టు. పోలీసులు, అధికారులు సమక్షంలో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది. -
Ajit Pawar: మోడీని గెలిపించింది డిగ్రీ కాదు… జనాకర్షణ..
Ajit Pawar comments on Modi's degree: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిగ్రీపై ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ డిగ్రీలను బహిర్గత పరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు జరిమానా కూడా విధించింది. చదువులేని ప్రధాని దేశానికి ప్రమాదం అంటూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మరోవైపు దేశంలోని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోదీ డిగ్రీ చూపించాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. -
Car Sales in FY23:: ఎఫ్వై 23లో రికార్డు కార్ సేల్స్.. ఈ కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి..
Record car sales: 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు నమోదు అయ్యాయి. కార్ల అమ్మకాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఎస్ యూ వీ విభాగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా అమ్మకాల్లో మంచి వృద్ధి సాధించాయి. మొత్తం ఎఫ్వై(ఫైనాన్షియల్ ఇయర్) 23లో 3,889,545 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. -
Apple: లేఆఫ్స్ జాబితాలోకి ఆపిల్.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం..
Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి. -
Mansukh Mandaviya: కరోనా, హార్ట్ ఎటాక్ మధ్య సంబంధం.. కేంద్ర ఆరోగ్యమంత్రి స్పందన ఇదే..
Mansukh Mandaviya: కరోనా ఒక వైరస్, ఇది పరివర్తన చెందుతూనే ఉంటుందని, భారతదేశంలో ఇప్పటి వరకు 214 విభిన్న రకాలను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఇటీవల కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, వారానికోసారి సమీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు పెద్దగా ప్రమాదకరం కావని ఆయన అన్నారు. -
NATO: నాటో కూటమిలో సభ్యదేశంగా ఫిన్లాండ్..
Finland joins NATO military alliance: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేసింది. మరో స్కాండనేవియన్ దేశం స్వీడన్ ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు మొగ్గు చూపాయి. తాజాగా ఫిన్లాండ్ దేశం కూటమితో సభ్య దేశంగా చేరింది. దీంతో నాటో ఆధిపత్యం రష్యాకు మరింత సమీపంలోకి వచ్చినట్లు అయింది.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!