Corona Cases In India: ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు 15-20 వేల మధ్య నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కేసుల సంఖ్య 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతోంది. దీంతో పాటలు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దిగివస్తోంది. రికవరీ రేటు పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 736 కేసులు తక్కువగా నమోదు…
Sonali Phogat Case: Club Owner, Drug Dealer Arrested: దేశవ్యాప్తంగా బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్ హత్య కేసు చర్చనీయాంశంగా మారింది. ముందుగా గుండె పోటుతో మరణించిందని.. అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ తర్వత హత్య కోణం వెలుగులోకి వచ్చింది. గోవాలో ఉన్న సమయంలో ఆమె అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఈ మరణంపై ఆమె సోదరుడు రింకూ ఢాకా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఆమె శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేల్చింది. దీంతో…
Recent Big Exits In Congress Party : గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు అసలు ఏమైంది. ఎదురు దెబ్బలు తగులుతున్నా.. పార్టీ మారేందుకు సిద్ధంగా లేదా.. దీంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీలకు మారుతున్నారా..? ఇది గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో దినదినం పతనావస్థకు చేరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు లేవు.. చివరకు అధ్యక్షుడిని కూడా ఎన్నుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో…
Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దొరికారు.
Delhi Police denies permission to stand up comedian Munawar Faruqui: స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. షోకు అనుమతిస్తే మతపరమైన ఉద్రిక్తతతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే షోకు అనుమతి ఇస్తే అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో.. ఆగస్టు 28న జరగాల్సిన మునావర్ ఫరూఖీ షో రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది. ఇదే నెలలో బెంగళూర్ పోలీసులు కూడా ఇదే విధంగా మునావర్ షోకు…
Prime Minister Narendra Modi will inaugurate Atal Bridge: ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అహ్మదాబాద్ ‘అటల్ బ్రిడ్జ్’ ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. సబర్మతి రివర్ డెవలప్మెంట్ లో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌కు తూర్పు, పడమర వైపుల కలిపే అటల్ బ్రిడ్జిని నిర్మించారు. మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. దాదాపుగా 300 మీటర్ల ఫుల్ ఓవర్ బ్రిడ్జ్..…
Sri Lankan children suffering from hunger: శ్రీలంక దేశ ఆర్థిక కష్టాలు ఇప్పటికిప్పుడే తీరేలా లేవు. గత మార్చి నుంచి శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్, డిజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. పనులు లేక మహిళలు వ్యభిచారులుగా మారుతున్న దయనీయ పరిస్థితులు శ్రీలంకలో చూస్తున్నాం. శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోయాయి. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలను తెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమను ఆదుకోవాలని ఐఎంఎఫ్ ను కోరుతోంది శ్రీలంక.
Nagaland Gets Its 2nd Railway Station After A Gap Of Over 100 Years: ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తం కొండలు, గుట్టలు, వాగులు, నదులతో ఉండే భౌగోళిక స్వరూపం రైల్వే నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు రైల్ అనుసంధానంలో వెనకబడి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈశాన్య రాష్ట్రాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు రైల్వే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. దీంట్లో భాగంగానే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్ల…
Justice Lalit will take charge as the CJI of the Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ యు. యు. లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్ లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. మూడు తరాలుగా…
Party Funds: గుర్తు తెలియని మూలల నుంచి వచ్చే విరాళాల్లో ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ సీపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన గుప్త నిధుల్లో ప్రాంతీయ పార్టీల్లో వైసీసీ మొదటిస్థానంలో ఉంది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య అన్ని జాతీయ పార్టీలకు కలిపి రూ. 15,077 కోట్ల గుప్త నిధులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. 2020-21లో ఈ పార్టీలన్నింటికీ…