Madhya Pradesh -man stabs young woman for rejecting marriage proposal: జార్ఖండ్ దుమ్కా తరహాలోనే మధ్యప్రదేశ్లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే జార్ఖండ్ దుమ్కా మర్డర్ కేసుల దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఓ బాలికను కత్తిలో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని బంగర్ఢ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు బబ్లూ, పెళ్లి చేసుకోవాలని 20 ఏళ్ల యువతి వెంట పడుతున్నాడు.…
300 Years Old Idols Recovered in tamil nadu: ఎంతో విలువైన, అరుదైన దేవతా విగ్రహాలు తమిళనాడులో ఓ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఐడల్ వింగ్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలు దాదాపు 300 ఏళ్ల పాతవని గుర్తించారు. చెన్నైలో ఉంటున్న ఓ వ్యక్తి పురానత విగ్రహాలను ఉన్నాయనే రహస్య సమాచారంతో తమిళనాడు పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ రెండు విగ్రహాలు పట్టుబడ్డాయి.
Two Kerala youths died in Ireland: ఐర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటిలో ముగిని చనిపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలురు బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం వీరిద్దరు మరికొంత మంది స్నేహితులతో కలసి ఉత్తర ఐర్లాండ్ లో ఉన్న సరస్సుకు వెళ్లారు. చనిపోయిన వారిని జోసెఫ్ సెబాస్టియన్, రేవెన్ సైమన్ లు గా గుర్తించారు. వీరితో పాటు మరో 6 మంది సరదాగా ఈతకు వెళ్లారు. ఈ…
Math Teacher Thrashed By Students in Jharkhand: తక్కువ మార్కులు ఇచ్చాడని ఏకంగా ఉపాధ్యాయుడినే చెట్టుకు కట్టేసి చితకబాదారు విద్యార్థులు. టీచర్ తో పాటు క్లర్కును కూడా విద్యార్థులు వదిలిపెట్టలేదు. ఇద్దర్ని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో సోమవారం జరిగింది. 9 వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశాడని.. మాథ్స్ టీచర్ తో పాటు గుమాస్తాను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి…
Corona cases in india: దేశంలో కరోనా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది. దీంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా కరోనా కేసుల సంఖ్య 10 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య 10 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య…
Microsoft offered a job to a visually impaired person with a huge package: ప్రతిభకు ఏ శారీరక లోపం కూడా అడ్డంకి కాదు. చాలా మంది తమ సమస్యలపై పోరాడి జీవితంలో విజయం సాధించారు. ఉన్నత స్థానాలుకు వెళ్లారు. కంటి చూపు లేకపోయినా.. శారీరక వైకల్యం ఉన్నా కూడా జీవితంలో పోరాడి గెలిచారు. తన ప్రతిభకు ఇవేమే అడ్డంకులు కాదని నిరూపించారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. పనిచేసేందుకు కొంతమంది బద్ధకిస్తున్న ఈ రోజుల్లో తమ వైకల్యాన్ని అధిగమిస్తూ ఉన్న స్థానాలకు…
Suspended BJP leader Seema Patra arrested: అక్రమాలకు, హింసకు పాల్పడిన ఇద్దరు బీజేపీ నాయకులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. చైల్డ్ ట్రాఫికర్స్ నుంచి ఏడు నెలల బాలుడిని కొనుగోలు చేసిన ఆరోపణలపై ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. వినీతా అగర్వాల్, ఆమె భర్త కృష్ణ మురారి అగర్వాల్ లకు కుమార్తె ఉంది. అయితే తమకు మగ బిడ్డ ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ ఏడు నెలల శిశువును రూ.1.80 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ…
Tribute to Telugu IFS officer who was killed by Veerappan: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఓ మారుమూల కుగ్రామం గోపీనాథం. అయితే 90ల దశకంలో ఈ పేరు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కార్యకలాపాలతో ఈ ఊరి పేరు వార్తల్లో నిలిచింది. కర్ణాటక రాష్ట్రం చామరాజనగరం జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది గోపీనాథం. ఈ ఊరితో తెలుగు రాష్ట్రాలకు కూడా అనుబంధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పి. శ్రీనివాస్…
Electric Vehicles in India To Touch 5 Crore By 2030: భారత్ తో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు అమ్మకాలు పెరిగాయి. కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 5 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది.
Two terrorists killed in Shopian encounter in jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో భద్రతాబలగాలు మరోసారి పైచేయి సాధించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో గత కొంత కాలంగా ఉగ్రవాదులు ఏదైనా దాడికి పాల్పడాలని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు స్థానికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. కానీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ప్లాన్స్ ను భగ్నం చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు.